సొంత సర్వేలో కూడా షాకులే తగిలాయి | ranks to Modi ministers according to people opinion

Ranks to modi ministers according to people opinion

narendra modi, cabinet ministers, two years poll, మోదీ కేబినెట్ కు ర్యాంకులు, రెండేళ్ల పాలన సమీక్ష, national news, political news, politics, latest news, PM modi news

According to an opinion poll, Union Transport Minister Nitin Gadkari has been rated as the best performing minister in PM Modi's cabinet.

సొంత సర్వేలో కూడా షాకులే తగిలాయి

Posted: 05/27/2016 05:52 PM IST
Ranks to modi ministers according to people opinion

అనుకున్నది ఒకటి, అవుతుంది వేరోకటి. ఎన్డీయే ప్రభుత్వం స్వయంగా నిర్వహించిన సర్వేలోనూ గట్టి షాకులే తగిలాయి. రెండేళ్ల పాలనపై అభిప్రాయం కొరుతూ సర్వే నిర్వహించగా, పాపులర్ పథకాలన్నింటిని రాజేసి రైల్వే శాఖ టాప్ పొజిషన్ లో నిలిచింది. ముఖ్యంగా మోదీ మానస పుత్రికలుగా భావిస్తున్న స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా పథకాలకు కూడా తక్కువ మార్కులు పడటం విశేషం. మొత్తం 30 ప్రశ్నల జాబితాతో రేటింగ్ ఇవ్వాల్సిందిగా ప్రజలను ప్రశ్నించారు. మొత్తం ప్రభుత్వ రంగాల్లో సేవలు అందించడంలో కేవలం రైల్వే శాఖ భేషని వెల్లడైంది. అంతేకాదు ఆ శాఖా మంత్రి సురేష్ ప్రభు అధ్బుతంగా పని చేస్తున్నారని 74 శాతం మంది కితాబిచ్చారు. ఆయన పనితీరుకు 5 స్టార్ రేటింగ్ కూడా లభించింది. అయితే ఓవరాల్ జాబితాలో మాత్రం ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. గడ్కరీ, పీయూష్ గోయల్, మనోహర్ పారికర్ తొలి మూడు స్థానాల్లో ఉండగా, సీనియర్ నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నారు.

ఇంకోవైపు నల్లధనం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అత్యధికులు వెల్లడించగా, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియాలు కిందనుంచి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మొత్తం 15 పథకాల గురించి ఇందులో ప్రశ్నించగా, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ విధానాలకు 65.8 శాతం మంది మద్దతు పలికి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇతర మంత్రుల్లో సుష్మా స్వరాజ్ నేతృత్వంలోని విదేశాంగ శాఖ పనితీరుకు 63 శాతం మంది, పీయుష్ గోయల్ నిర్వహిస్తున్న విద్యుత్ శాఖకు 57 శాతం మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు.  మోదీ ఆలోచనల నుంచి పుట్టిన మేకిన్ ఇండియాకు 53 శాతం మంది, ఇండియాలో వ్యాపారం తేలికగా మారిందని 49 శాతం మంది పేర్కొన్నారు. అవినీతి కాస్త తగ్గిందని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఓవరాల్ గా జీఎస్ టీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేయలేకపోవటం మోదీ ప్రభుత్వపు అతిపెద్ద వైఫల్యంగా మెజార్టీ ప్రజలు పేర్కొన్నారు. ఇంకా ఈ సర్వేలో భాగంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకంలో చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల రుణం లభిస్తుందని తెలుసా? ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కింద 5 కోట్ల మంది పేదలకు వంటగ్యాస్ ఉచితంగా లభిస్తుందని తెలుసా? వంటి ప్రశ్నలకు అవును లేదా కాదు అనే సమాధానాలు అడిగారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫలితాల విషయంలోనే అంచనాలు తారుమారు అవటం మాత్రం బీజేపీ శ్రేణులను కాస్త నిరాశకు గురిచేసిందనే చెప్పాలి.  

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM modi cabinet  rankings  two years rule  opinion poll  

Other Articles