బాబా ఆశ్రమంలో బ్లూ ఫిల్మ్ సీడీలు! | baba arrested for sexual harrasment on devotees

Baba arrested for sexual harrasment on devotees

baba paramanand, UP baba, sex allegations, filming devotees, యూపీ సెక్స్ బాబా, కామ బాబా, స్వామీ పరమానంద, బాబా సెక్స్ వీడియోలు, national news, entertainment, latest news, UP news

baba paramanand arrested for sex allegations in UP. woman complaints that sex baba filming them in vulgur manner and blackmailed.

బాబా ఆశ్రమంలో బ్లూ ఫిల్మ్ సీడీలు!

Posted: 05/27/2016 01:03 PM IST
Baba arrested for sexual harrasment on devotees

ఆధ్యాత్మికం అనే ముసుగులో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే బాబాల జాబితా రోజు రోజుకీ పెరిగిపోతోంది. దైవ ధ్యానం కోసం వెళ్లే భక్తులను దోచుకోవటంతోపాటు, అదనంగా ఆ యావతో వెకిలి చేష్టలు, లైంగిక దాడులు చేస్తూ దొరికిపోయి వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటివారిపై మీడియాల్లో ఎన్ని కథనాలు వస్తున్నా సరే భక్తులకు వారిపై నమ్మకం మాత్రం సడలటం లేదు, ఈ దైవ దూతలకు మొక్కటం ఆపటం లేదు. ఇదే కోవలో ఇప్పుడు మరో స్వామీజీ చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. సంతానం ప్రసాదిస్తానంటూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు.

ఉత్తర ప్రదేశ్ లో రాం శంకర్ తివారీ అలియాస్ బాబా పరమానంద్ బాగా ఫేమస్. పిల్లల కోసం సెక్స్ స్పెషలిస్ట్ ల డాక్టర్ల దగ్గర కట్టే క్యూ కన్నా ఇతగాడి దగ్గరే జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటిది తాజాగా ఈ పెద్దాయనను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. బరాబంకిలో ఈయన గారి ఆశ్రమంలో తమపై అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, అత్యాచారం కూడా చేయబోయాడని కొంతమంది మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆశ్రమంపై దాడి నిర్వహించగా సోదాలో మహిళలను అశ్లీలంగా చిత్రీకరించిన సీడీలతోపాటు కొన్ని బ్లా ఫిల్మ్ సీడీలు కూడా లభించాయి. ఖాకీలను చూసి కంగారు పడిన ఆ దొంగ బాబా అక్కడి నుంచి ఉడాయించాడు. చివరికి మధ్యప్రదేశ్ లోని సత్నా వద్ద మాటు వేసి ఈ కామ బాబాని పట్టేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఓల్డ్ గాడ్ మెన్ చెరసాలలో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. తన దగ్గరి వచ్చే భక్తులకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఆపై చేసే తతంగాన్ని చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలుస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swamy paramananda  UP baba  sex allegations  latest news  telugu news  

Other Articles