ప్రకాశం పంచ్ ను లైట్ తీస్కుంటున్నాడా? | two more YCP MLAs ready to join in TDP

Two more ycp mlas ready to join in tdp

prakasham YSRCP MLAs, Kandukuru MLA Pothula Rama Rao, Giddalur MLA Ashok Reddy, TDP, ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ, పోతుల రామారావు, గిద్దలూరు అశోక్ రెడ్డి, AP politics, telugu news, latest news

The TDP has targeted Jagan’s inner camp itself. Kandukuru MLA Pothula Rama Rao and Giddalur MLA Ashok Reddy on Thursday held discussions with their followers on joining the ruling Telugu Desam Party.

ప్రకాశం పంచ్ ను లైట్ తీస్కుంటున్నాడా?

Posted: 05/27/2016 12:12 PM IST
Two more ycp mlas ready to join in tdp

ఏపీలో వలసల్లో భాగంగా వైసీపీ నుంచి వరుసగా వికెట్లు పడనున్నాయి. ఫిరాయింపులపై ఓవైపు జాతీయ స్థాయిలో జగన్ హైలెట్ చేస్తున్నా... ఆ పార్టీ నేతలు మాత్రం వారి పనిని వారు కానిచ్చేసుకుంటున్నారు. ఇప్పటికే మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షంలోకి చేరిపోగా, ఇప్పుడు మరో ఇద్దరు అదే బాటలో పయనించనున్నట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్ మూడో దశలో భాగంగా ప్రకాశం జిల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై టీడీపీ దృష్టిసారించింది. ప్రకాశంలో ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కందుకూరు, గిద్దలూరు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డి మహానాడు అనంతరం టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వారి కదలికలు దాదాపు అదేనని సూచిస్తున్నాయి. చంద్రబాబు తనయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ తతంగం వెనుక ఉండి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తొలుత కుటుంబ సభ్యులు, బంధువర్గీయులతో మంతనాలు జరిపారు. ఆతర్వాత శ్రేయోభిలాషులతో సమాలోచనలు చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత తనకు మంచిపట్టున్న గిద్దలూరు, రాచర్ల మండలాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులతో ఆయన సమాలోచనలు జరిపారంట. మిగతా మండలాల నేతలతో శుక్రవారం సమావేశం అయి సాయంత్రం కల్లా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరోవైపు  కందుకూరు ఎమ్మెల్యే రామారావు టంగుటూరులో గురువారం తన వర్గీయులతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆలోచనకు రావడానికిగల కారణాలను కార్యకర్తలకు వివరించినట్లు సమాచారం. గురువారం విజయసాయిరెడ్డి రాజ్యసభ నామినేషన్ దాఖలుకు వీరిద్దరు గైర్హాజరవటం, వీరిని నిలువరించేందుకు కూడా జగన్ కానీ, సీనియర్ నేతలు గానీ ప్రయత్నించకపోవటంతో దాదాపు వీరిద్దరు సైకిల్ ఎక్కటం ఖాయంగానే కనిపిస్తోంది. మరోవైపు జగన్ కి దగ్గరి బంధువు, సీనియర్ నేత అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా టీడీపీలో చేరతారనే ఊహాగానాలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. మూడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పని చేసిన బాలినేని జగన్ మీద నమ్మకంతో సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆర్థిక సమస్యలతోపాటు, జగన్ వ్యవహార శైలి కూడా ప్రస్తుతం ఆయన పార్టీ మారేందుకు కారణాలుగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles