మహానాడులో ఏం జరగబోతుంది? | TDP Mahanadu to begin in Tirupati today

Tdp mahanadu to begin in tirupati today

tirupathi, TDP mahanadu, chandrababu naidu, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ మహానాడు, తిరుపతి మహానాడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ap politics, political news, latest news

TDP Mahanadu to begin in Tirupati today. threedays. The Mahanadu this year assumes significance as it comes at a time when repeated requests made by the TDP government to the Central government to fulfil the host of promises made on the floor of Parliament, including the grant of Special Category Status to the new State, remain unfulfilled

మహానాడులో ఏం జరగబోతుంది?

Posted: 05/27/2016 11:07 AM IST
Tdp mahanadu to begin in tirupati today

తెలుగుదేశం పార్టీ యేటా చేసుకునే పండగ మహానాడు కోసం సర్వం సిద్ధమైంది. మే 27, 28, 29 మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం తిరుపతి నెహ్రూ మున్సిపల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తిరుపతిలో మహానాడు నిర్వహించడం ఇది మూడోసారి. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను వచ్చే అవకాశం ఉండటంతో  భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 30 వేల మంది కూర్చునే విధంగా స్థభాస్థలిని రూపొందించారు. వేదికపై అధినేతతో పాటు కీలక నేతలు కూర్చునే విధంగా డిజైన్ చేశారు. ఏపీ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా టీడీపీ సాంస్కృతిక విభాగం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు వేదిక వద్దకు చేరుకుని ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.

పార్టీ జెండా ఆవిష్కరించి, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కి నివాళులర్పించి చంద్రబాబు మహానాడును ప్రారంభిస్తారు. ఇక తొలిరోజు  7 తీర్మానాలపై చర్చించనున్నారు. ఏడాది పాలన సమీక్షతోపాటు, కొత్త పథకాల రూపకల్పన, అమరావతి తదితర అంశాలపై ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యేడు మహానాడు టీడీపీకి చాలా ప్రత్యేకం. ఎందుకంటే నవ్యాంధ్ర ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి విజ్ణప్తి చేసిన తెలుగుదేశం ఈ మహానాడు వేదికగా ఏం మాట్లాడబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం గురించి చంద్రబాబు ఈ వేడుకను వేదికగా చేసుకుని కేంద్రానికి మరోసారి విజ్ణప్తి చేసే అవకాశం కూడా లేకపోలేదు.

ఇక రెండో రోజు మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనున్నారు. ప్రత్యేకంగా స్వీట్లు, వంటకాలు తయారు చేయిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యదర్వి నారా లోకేష్ ఏర్పాట్లను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఇక తెలంగాణలో మినీమహానాడుతో సరిపెట్టినప్పటికీ,  తిరుపతి మహానాడులో కూడా ఆలోటును పూడ్చాలని చూస్తోంది. బాబు రెండేళ్ల పాల‌నపై ప్రత్యేక బుర్రక‌థ‌లతో పాటు , తెలంగాణాలో టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌పై పార్టీని కార్యక‌ర్తల‌ను ఉత్తేజ‌ప‌రిచేలా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాను రూపొందిస్తున్నారు. దాదాపు రెండు వంద‌ల‌ మందికి పైగా క‌ళ‌కారుల‌ను ఇందుకు సిద్ధం చేస్తున్నారు. చివరి రోజు కీలకనేతల ప్రసంగాలతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలతో మహానాడు వేడుకలు ముగియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP Mahanadu  tirupathi mahanadu  chandrababu naidu  

Other Articles