వెంకన్న భజన మరీ ఎక్కువైంది | karnataka congress senior leader praised venkaiah naidu

Karnataka congress senior leader praised venkaiah naidu

venkaiah naidu, karnataka rajyasabha, fourth time, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, కర్ణాటక రాజ్యసభ, ఎంపీ వెంకయ్యనాయుడు, national news, political news, latest news

central minister venkaiah naidu again from karnataka rajyasabha quota fourth time.

వెంకన్న భజన మరీ ఎక్కువైంది

Posted: 05/27/2016 09:33 AM IST
Karnataka congress senior leader praised venkaiah naidu

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అరుదైన రికార్డును సాధించబోతున్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి  ఇప్పటికే మూడుసార్లు ఆయన రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పోటీ ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఎన్నిక కావొచ్చనే ఊహగానాలు అందాయి. ఇప్పటికే కోటాలో నిర్మలా సీతారామన్ ఉండటం, టీడీపీ నుంచి మద్ధతు లభించే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆయన ఎంపికపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే వీటన్నింటిన పటాపంచల్ చేస్తూ తిరిగి ఆయన కర్ణాటక నుంచే రాజ్యసభకు పోటీచేయనున్నారు. ఇందుకు సంబంధించి అధిష్టానం నుంచి, మిగతా ప్రాంతీయ నేతల గ్రీన్ సిగ్నల్ లభించినట్లు కూడా తెలుస్తోంది. కర్ణాకటకు చెందిన నేతగా ఇప్పటిదాకా 18 ఏళ్ల పాటు కొనసాగారు. తాజాగా మరోమారు కూడా అక్కడి నుంచే రాజ్యసభకు ఎన్నికయి అరుదైన రికార్డు సృష్టించబోతున్నారు.

సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాదాలకు, వ్యక్తిగత ఆరోపణలకు దూరంగా, ఆజాత శత్రువుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అభ్యర్థిత్వంపై కన్నడిగులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు వ్యక్తం చేస్తే పెద్దగా పట్టించుకోనక్కరలేదు కానీ, బీజేపీ బద్ధ విరోధి పార్టీ కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తే ప్రత్యేకమే కదా. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎంవీ రాజశేఖరన్ ఇటీవలే వెంకయ్యకు ఓ లేఖ రాశారు. అందులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం కన్నడిగుల భాగ్యమని రాజశేఖరన్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్య పాటుపడతారన్న నమ్మకం తనకుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ పదవిలో ఉంటే ఆ పదవికి వెంకయ్య వన్నె తెచ్చారని కూడా రాజశేఖరన్ ఆ లేఖలో పేర్కొనటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  karnataka MP  rajyasabha  

Other Articles