టీఆర్ఎస్ఎల్పీలో ఆంధ్రా ఎమ్మెల్యేల హల్ చల్ | AP YSRCP MLAs hulchul in TRSLP

Ap ysrcp mlas hulchul in trslp

AP YSRCP MLAs, kodali nani, jogi ramesh, tummala nageshwarrao, వైసీపీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ఎల్పీ, తుమ్ముల, కొడాలి నాని, జోగిరమేష్, టీఆర్ఎస్ఎల్పీలో ఆంధ్రా ఎమ్మెల్యేలు, telangana news, telangana politics, latest news, political news

AP YSRCP MLAs kodali nani and jogi ramesh visited TRSLP office and wishes tummala nageswarrao for paleru victory.

టీఆర్ఎస్ఎల్పీలో ఆంధ్రా ఎమ్మెల్యేల హల్ చల్

Posted: 05/26/2016 06:10 PM IST
Ap ysrcp mlas hulchul in trslp

సరిహద్దు లో వివాదానికి ఏ మాత్రం తీసిపోదు తెలంగాణ -ఏపీ నేతల మధ్య మాటల యుద్దం. అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చాలని చూస్తున్నారంటూ ఏపీ విపక్షాలన్నీ ఏకమై కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తుంటే, వారికి ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ లు ఇస్తున్నారు టీ నేతలు. ముఖ్యంగా జగన్ జలదీక్ష సమయంలో ఆ పార్టీ నేతలంతా ఓకింత పరుష పదజాలాన్నే వాడారు. దీంతో వార్ ముదురుతుందని అంతా అనుకున్నారు. ఇది పక్కనపెడితే హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో కాసేపటి క్రితం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.  టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయం (టీఆర్ఎస్ఎల్పీ)లో ఏపీ విపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రత్యక్షమై హడావుడి చేశారు.  

ఇంతకీ మ్యాటరేంటంటే పాలేరు ఉపఎన్నికలో తుమ్మల నాగేశ్వరావు భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీని వీడి టీఆర్ఎస్ గూటికి చేరిన ఈ సీనియర్ నేతకు తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి,  ఆపై మంత్రి పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరు అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించింది టీఆర్ఎస్. సానుభూతి గాలిని సైతం చేధించి మరీ రికార్డుస్థాయిలో బంపర్ మెజారిటీతో గెలిచాడు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తుమ్మల ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు కాసేపటి క్రితం అసెంబ్లీకి చేరుకున్నారు. ఇదే సమయంలో రాజ్యసభకు వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అసెంబ్లీకి వచ్చారు. సాయిరెడ్డితో పాటు కూడా వచ్చిన కొడాలి నాని, జోగి రమేశ్ లు.. నేరుగా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్లి తుమ్మలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో తుమ్మల, కొడాలి నాని టీడీపీలో పని చేయటం, ఆ చనువుతోనే ఇలా తుమ్మలకు గ్రీటింగ్స్ చెప్పటం జరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మీడియా ఈ ఆసక్తికర భేటీని కెమెరాలతో బంధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodali nani  jogi ramesh  TRSLP  tummala nageshwarrao  

Other Articles