ITEMVIDEOS: ఆ ఆయుష్షు చాలా గట్టిదండోయ్

Buffalo escaped from five lions

buffalo, escaped, five lions, దున్నపోతు, ఐదు సింహాలు, international news, latest news

lucky buffalo escaped from five Furucious lions in South Africa

ITEMVIDEOS: ఆ ఆయుష్షు చాలా గట్టిదండోయ్

Posted: 05/26/2016 06:00 PM IST
Buffalo escaped from five lions

మొన్నామధ్య ఓ ప్రబుద్ధుడు తప్పతాగి .జూలో వెళ్లి సింహం ఎన్ క్లోజర్ లోకి దూకి మరీ మృగరాజులకే సవాలు విసిరాడు. అయితే అతనిపై సింహాలు అంతగా ఆసక్తి చూపకపోవటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మాములుగా సింహం గాండ్రింపు వింటేనే గుండెలు వణికిపోతాయి. అలాంటిది ఏకంగా ఐదు బలమైన సింహాలు మీద పడితే పరిస్థితి ఏంటి? వాటి నోట్లో పచ్చడి కావటం తప్ప. కానీ, ఇక్కడో దున్నపోతు మాత్రం చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడింది.

దక్షిణాఫ్రికాలోని మాలామాలా ప్రైవేట్ గేమ్ రిజర్వ్ లో చోటుచేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆకలితో నకనకలాడుతున్న ఐదు సింహాలు ఒకేసారి దున్నపోతు మీద పడ్డాయి. ఇక తన పని అయిపోయిందనుకున్న దున్నపోతు కూలబడిపోయింది. సడన్ గా దున్నపోతును వదిలేసి ఆ ఐదు సింహాలు కొట్టుకోవటం ప్రారంభించాయి. ఇదే అదనుగా భావించిన దున్నపోతు బతుకు జీవుడా అంటూ ఎంచక్కా అక్కడి నుంచి పారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : buffalo  five lions  viral video  

Other Articles