శవంతో కూడా ఇలా చేశారా? | Medical staff trying to take nude photos of deadbody

Medical staff trying to take nude photos of deadbody

Pariyaram medical college staff, nude photos of deadbody, కేరళ, శవం నగ్నఫోటోలు, పరియారం మెడికల్ సిబ్బంది, kerala news, political news, latest news

case registered on two staff of the Pariyaram Medical College who were accused of disrespecting the dead body of young women during the embalming in kannur government hospital Kerala.

శవంతో కూడా ఇలా చేశారా?

Posted: 05/26/2016 11:50 AM IST
Medical staff trying to take nude photos of deadbody

కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి ఏం చేస్తున్నారో అన్న స్పృహ కూడా లేకుండా పోతుంది. కన్నుమిన్ను కానకుండా మృగంలా మారి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనలను చదివినప్పుడు, చూసినప్పుడు ఛీ.. ఇలాంటి సమాజంలో మనం ఉన్నామా? అని ఒకింత ఆశ్చర్యానికి గురవుతుంటాం. ఇక్కడ జరిగిన ఓ ఉదంతంలో ఇద్దరు రాక్షసులు శవం అని కూడా చూడకుండా తమ పైశాచికత్వం చూపించారు. ఆ నికృష్ట చేష్టలు బంధువుల కంటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేరళలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...  కన్నూర్ ప్రభుత్వాసుపత్రికి మంగళవారం ఓ యువతి మృతదేహం పోస్ట్ మార్టం కోసం వచ్చింది. ఎనాటమీ అసిస్టెంట్ సునీల్ (44), నర్సింగ్ అసిస్టెంట్ మనోజ్(40) లు వెకిలి చేష్టలకు దిగారు. యువతి నగ్న మృతదేహాన్ని తమ సెల్ ఫోన్ లతో ఫోటోలు తీయసాగారు. ఇది గమనించి బంధువులు నిలదీయంతో మనోజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సునీల్ ను పట్టుకున్న బంధువులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మనోజ్ కోసం వెతుకుతున్నారు. కాగా, నిందితులిద్దరూ పెరియారం మెడికల్ కాలేజీకి చెందిన సిబ్బంది అని తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala  kannur govt hospital  lady deadbody  nude photos  

Other Articles