వెంబడించి చంపిన ఆకతాయిలు | Eve teasers killed a married woman

Eve teasers killed a married woman

Vishaka, Vishakapatnam, Eve teasing, విశాఖ, లావణ్య

In Vishakapatnam eve teasers killed a married woman with car. Lavanya named woman died on the spot and one woman also injured.

వెంబడించి చంపిన ఆకతాయిలు

Posted: 05/25/2016 07:34 AM IST
Eve teasers killed a married woman

విశాఖలో ఆకతాయిలు రెచ్చిపోయారు. లావణ్య అనే వివాహితను దారుణంగా ఏడిపించారు. ఆమె ప్రయాణిస్తున్న బైక్ ను వెంబడించి ఢీకొట్టడంతో కిందపడిన ఆమె తీవ్రగాయాల పాలైంది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. వడ్లపూడికి చెందిన లావణ్య, ఆమె భర్త అప్పలరాజు, ఆమె ఆడపడుచు దివ్య కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి దర్శనానికి వెళ్లారు. ఆ సమయంలో అనకాపల్లికి చెందిన దాడి హేమకుమార్, అతని స్నేహితులు లావణ్య దంపతులను ఉదయం నుంచి వేధించడం ప్రారంభించారు. దీంతో హేమకుమార్, అతని స్నేహితులను లావణ్య భర్త అప్పలరాజు సున్నితంగా మందలించాడు.

రెచ్చిపోయిన యువకులు వారిని వెంబడిస్తూ మరింతగా వేధింపులకు గురిచేశారు. అమ్మవారి దర్శనం ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న లావణ్య దంపతులను కారులో వెనుక నుంచి వెంబడిస్తూ ఇబ్బందులకు గురిచేశారు. లావణ్య దంపతులు సాలాపువానిపాలెం దాటుతున్న సమయంలో హేమకుమార్, అతని స్నేహితులు వెనుక నుంచి కారుతో ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. అనంతరం కారును పరవాడ వద్ద వదిలి పారిపోయినట్లు సమాచారం. హేమకుమార్, అతని స్నేహితులు పరారీలో ఉన్నారని, వారి ఇళ్లకు తాళాలు వేసి ఉండడాన్ని గమనిస్తే వారు కావాలనే లావణ్యను కారుతో ఢీకొట్టి హత్య చేశారని లావణ్య బంధువులు ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishaka  Vishakapatnam  Eve teasing  విశాఖ  లావణ్య  

Other Articles