100 రూపాయలకు 850 ఎకరాలు | 850 acres in hundred rupeers

850 acres in hundred rupeers

The National Trust, Farm House, 850 acres, Costal view, 850 ఎకరాలు, నేషనల్ ట్రస్ట్

The National Trust has put a £1 million farm on the market for just £1.The property, which would normally cost more than £1 million, is located on the top of Great Orme near Llandudno, North Wales. It has more than 850 acres, 500 sheep and costal views.

100 రూపాయలకు 850 ఎకరాలు

Posted: 05/25/2016 07:33 AM IST
850 acres in hundred rupeers

ఈ మధ్యన ఇల్లు కట్టాలన్నా. పెళ్లి చెయ్యాలన్నా అది జన్మలో జరిగే పని కాదు అని చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి. అసలే దరలు మండిపోతున్న రోజుల్లో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకోవాలంటేనే వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అలాంటిది 850 ఎకరాల్లో ఉండే ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకోవాలంటే లక్షలు చెల్లించాలి. కానీ ఇంగ్లాండ్ లోని సౌత్ వేల్స్ లో ఉండే పార్స్ ఫామ్ ను కేవలం ఏడాదికి వందరూపాయలకే అద్దెకిస్తామంటోంది ఓ స్వచ్ఛంద సంస్థ. ఆసక్తి కగిలిన అభ్యర్ధుల నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. విచిత్రంగా ఉంది కదూ.

సముద్రానికి దగ్గరగా ఉన్న పార్స్ ఫామ్ లో 4 బెడ్ రూమ్ లు ఉన్న ఇల్లుతో పాటు 416 గొర్రెలను ఇస్తారట. అయితే ఓ కండిషన్ ఉందండోయ్. అదేంటంటే ఇక్కడ అద్దెకు దిగాలనుకునేవారు ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులు అయి ఉండాలట. అంతేకాదు అక్కడ ఉండే జీవ జాతుల్ని కూడా పరిరక్షించేలా షరతు ఉంది. ఇక వ్యవసాయం చేసిన అనుభవం కూడా అవసరం. ఈ అర్హతలు ఉంటే చాలు జూన్ 10లోపు అప్లికేషన్స్ ను పంపించాలి. దరఖాస్తుల్ని నేషనల్ ట్రస్ట్ ప్యానల్ పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ఈ పార్స్ ఫామ్ ను అద్దెకు ఇస్తారట. సో.. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles