ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం అంటూ విరహగీతం అలపిస్తున్నాడు ఓ ప్రేమికుడు. తనపై కోసంతో తన ప్రేయసి విడిపోతుండటంతో అతను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. అంతేకాదు చేయకూడని పనులు కూడా నడిరోడ్డుపై చేసి అబాసుపాలయ్యాడు. అయినా ఆ కఠినాత్మురాలి హృదయం కరగలేదు. తన ప్రియుడిపై పబ్లిగానే చేయకూడని పనులు చేసింది. ఇంతకీ ఏమైందంటారా..? ప్రేయసి ‘ఇక చాలు.. విడిపోదాం’ అని చెబితే కొంతమంది ఎగిరి గంతేస్తారు.. మరికొందరు దేవదాసులా మారిపోతారు.
చైనాలో ఓ కుర్రాడు మాత్రం ‘ప్లీజ్ నన్ను వదలద్దు’ అంటూ అచ్చంగా ఆమె కాళ్లు పట్టుకుని నేలమీద పడి ఆమెను ప్రాధేయపడ్డాడు. ‘ఛీ.. పో.. నువ్వు నాకు వద్దు’ అంటూ ఆ అమ్మాయి అతగాడిని పలుమార్లు చెంపమీద కొట్టింది. అయినా అతడు మాత్రం వదల్లేదు. అతడు గట్టిగా ఆమె కాళ్లు పట్టుకుని ఉండటంతో ఆమెకు తప్పించుకుని పోవడానికి కూడా వీలు కుదర్లేదు. రోడ్డు మధ్యలో నేలమీద పడి.. ఆమె కాలు పట్టుకుని ప్రేమభిక్ష పెట్టమంటూ వేడుకున్నాడు. అయినా ఆమె మాత్రం అతడిని చీదరించుకుంటూ ‘సిగ్గు లేదా.. నన్ను వెళ్లనివ్వు, నీకు చికాకు అనిపించడం లేదా’ అని విసుక్కుంది.
చివరకు కాళ్లతోను, చేతులతోను కొట్టడం మొదలుపెట్టింది. కానీ అతడు మాత్రం ‘దయచేసి.. నన్ను వదలొద్దు’ అంటూ ప్రాధేయపడుతూనే ఉన్నాడు. ఆమె మాత్రం ఇక ఇద్దరం కలిసుండే ప్రసక్తి లేనే లేదని చెబుతోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు రాష్ర్టంలో గల హువియాన్ నగరంలో ఈ సంఘటన జరిగింది. చుట్టుపక్కల వెళ్లే వారంతా ఇది చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. అంతేలే అమ్మాయిలను అస్సలు నమ్మెద్దు ఎంత కఠినంగా వుంటారో చూడండీ అంటూ కొందరు కామెంట్ చేయగా, మరికోందరు మాత్రం నాలుగు గోడల మధ్య సవ్యంగా లేకపోతే నలుగురిలో నవ్వుల పాలు కావాల్సివస్తుందంటూ కామెంట్ చేశారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more