Tax notice sent to CAG that ran Narendra Modi's 2014 elections campaign; service tax obligations of co under lens

Prashant kishor s cag served tax notice asked to submit annual reports bank statements

prashant kishor, prashant kishor cag, prashant kishore, prashant kishor tax notice, cag tax notice, narendra modi prashant kishor, prashant kishor nitish kumar, prashant kishor congress, poll strategist prashant kishor

Kishor was credit with successfully managing Prime Minister Modi's Lok Sabha election campaign that saw the BJP storm to power with its highest-every seat tally, but fell apart with BJP leaders soon after.

అధికారంలోకి తెచ్చిన వ్యూహకర్తపైనే కేంద్రం గురి..

Posted: 05/24/2016 06:07 PM IST
Prashant kishor s cag served tax notice asked to submit annual reports bank statements

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు నరేంద్ర మోదీ సర్కారు ఝలక్‌ ఇచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీని దేశానికి ప్రధాన మంత్రిగా చేయడంలో సఫలమైన రాజకీయ వ్యూహకర్తనే కేంద్రం టార్గెట్ చేసింది. బిహార్ ఎన్నికలలో ముఖ్యమంత్రి నితిప్ కుమార్ ను మరోమారు అధికార పీఠం దక్కేలా చేసిన ప్రశాంత్ కిషోర్ తీరుపై ఊపిరి బిగపట్టుకున్న కేంద్రం. ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఆయన వ్యూహాలను రచించడం బీజేపికి మింగుడు పడుతున్నట్లు లేదు.

ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం కూడా ఉత్తర్ ప్రదేశ్ లోనే వుండటం.. దీంతో మరోమారు ఆయన ప్రభంజనం వినిపించాలని ఇప్పటికే అరెస్సెస్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యూహకర్త చెక్ పెడుతున్నారన్న వార్తలు అందుతున్నాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన అత్యధిక అసెంబ్లీ, ఎంపీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో తమ గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుసుకున్న కేంద్రం ఇందుకు కారణమైన ఎన్నికల వ్యూహకర్తపైనే గురిపెట్టిందన్న విమర్శలు వినబడుతున్నాయి.

అందుకనే ఆయన నడుపుతున్న అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంట్ బుల్ గవర్నెన్స్(సీఏజీ)కు ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. గత నాలుగేళ్లకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. సీఏజీ అహ్మదాబాద్ చిరునామాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ ఈ నోటీసులు పంపింది. సీఏజీ అధికారులు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. వార్షిక నివేదికలు, బిల్లులు, ఇన్ వాయిస్, ఖర్చులకు సంబంధించిన వివరాలు, బ్యాంకు స్టేట్ మెంట్స్ సమర్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన కంపెనీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. మరి వీటిని వ్యూహకర్త ఎలా ఎదుర్కోంటారో వేచి చూడాలి.
 
మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prashant Kishor  Poll strategist  CAG  Income Tax Notice  

Other Articles