కాకా హోటల్లో తిన్న ఒబామా | Barack Obama completed dinner in road side hotel

Barack obama completed dinner in road side hotel

Obama, America, Barack Obama, Hanoi, ఒబామా, హానోయ్, అమెరికా, బరాక్ ఒబామా

Barack Obama didn't want to miss out Monday night here in Hanoi, so he hit the town with renowned chef-turned-television host Anthony Bourdain. The pair dined together at Huong Lien, a bún chả restaurant that serves the grilled pork and noodle dish thought to originate in Vietnam's capital city.

కాకా హోటల్లో తిన్న ఒబామా

Posted: 05/24/2016 03:53 PM IST
Barack obama completed dinner in road side hotel

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు… సామాన్యులతో కలిసిపోవడం అంటే ఇష్టం. ఆయన రూటే సపరేటు.  ప్రస్తుతం హవాయిలో పర్యటిస్తున్న ఆయన నిన్న రాత్రి హఠాత్తుగా  ఓ రోడ్ సైడ్ రెస్టారెంట్ లోకి వెళ్లారు. హవాయి ఫేమస్ ఫుడ్ బన్ చాను ఆర్డరిచ్చారు. బన్ చా తింటూ…. హనోయ్ బీర్ సిప్ చేస్తూ… కబుర్లలో మునిగిపోయారు. ఒబామాతో పాటు ఫేమస్ ఫుడ్ క్రిటిక్ ఆంటోనీ బోర్డియన్ కూడా ఉన్నారు.

అగ్రరాజ్యం అధినేత అలా తమ రెస్టారెంట్ కు రావడాన్ని నమ్మలేకపోతున్నానంటోంది ఆ షాపు యజమానురాలు యన్ గ్యూన్ తీన్ లీన్. కల్లో కూడా ఊహించని విషయం ఇది అన్నారు. రెస్టారెంట్ బయట పెద్ద ఎత్తున మీడియా ఉంటే… ఏమో అనుకున్నానని.. వచ్చేది ఫేమస్ పర్సన్ అని అస్సలు తెలీదని చెప్పారు. అంతటి పెద్ద మనిషితో ఫొటో దిగలేకపోయానని బాధపడ్డారు లీన్.

ఒబామా రెస్టారెంట్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు బోర్డియన్. ఒబామా రాకతో స్థానికంగా ఉన్న రెస్టారెంట్లను… షాపులను క్లోజ్ చేయించారు అమెరికా భద్రతా అధికారులు.  మరోవైపు రెస్టారెంట్ బయట వేచి ఉన్న జనానికి అభివాదం చేస్తూ … నవ్వుతూ వారిని పలకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles