Reporter told to cover up on live TV showcases America's problems

Storm over weather presenter told to cover up on air

Liberte Chan, KTLA Tv anchor, News reader, news presenter, weather girl, liberte forced to cover a CARDIGAN live on air, Los Angeles, America

KTLA weather reporter Liberte Chan expressed confusion when an off-camera hand held out the piece of clothing. "What's going on?" she asked.

ITEMVIDEOS: న్యూస్ రీడర్ ‘లైవ్ నటన’పై విమర్శల వెల్లువ

Posted: 05/17/2016 05:32 PM IST
Storm over weather presenter told to cover up on air

లైవ్ ప్రోగ్రామ్ లో ఎవరైనా అడ్డువస్తే వెంటనే పిసీఆర్ డిపార్టుమెంటు, ప్రోడ్యూసర్ తదితర సంబంధిత వ్యక్తులపై విమర్శలు వెల్లివిరియడం కామన్. ఇక మన తెలుగు ఛానెళ్లలో అయితే న్యూస్ రీడర్లు తుమ్మినా,, దగ్గినా.. వెంటనే చర్యలు తీసుకుంటారు. ఒకటి రెండు సార్లు వదిలేసినా.. అదే రిపీట్ అయితే న్యూస్ రీడర్ల వల్ల ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారో తెలియని పరిస్థితి. అయితే లైవ్ ప్రోగ్రామ్ మద్యలో ప్రోడ్యూసర్ వచ్చి కోట్ వేసుకోవాలని ఇవ్వడం, దానిన ఆయనే న్యూస్ ప్రెజంటర్ కు తొగడటం వంటి ఘటను చేటుచేసుకుంటే ఏం జరుగుతుంది. మన వాళ్లు మరుసటి రోజు నుంచి సేవలను నిలిపేసినా అతిశయోక్తి కాదు. కానీ అదే అమెరికాలో అయితే బహిరంగ క్షమాపణ వరకు ఈ ఘటన దారి తీసింది.

ప్రత్యక్ష ప్రసారంలో అమెరికా టీవీ యాంకర్ లిబర్టె చాన్ చేసిన అభినయంపై అక్కడి టీవీ ప్రేక్షకుల నుంచి ఓవర్ యాక్షన్ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. వాతావరణ వార్తలు చదువుతూ మధ్యలో ఆమె చేసిన కొంటె పనిపై సోషల్ మీడియాలో భారీగానెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. శనివారం లాస్ ఏంజెలెస్ కేటీఎల్ఏ టీవీ స్టేషన్ లో ఉదయం 8 గంటలకు వాతావరణానికి సంబంధించిన వివరాలు చూపుతూ... 'బాగా చలిగా ఉంది' అంటూ కోటు(కార్డిగాన్) తొడుక్కుంది. కెమెరా కుడివైపు నుంచి అందించిన కోటును ప్రత్యక్ష ప్రసారంలో వేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది.

చాన్ విన్యాసంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. లైవ్ ప్రసారంలో ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ మండిపడ్డారు. ఆమె వేస్తుకున్న బ్లాక్ డ్రెస్ మీద కూడా విమర్శలు వచ్చాయి. అయితే తానేమీ తప్పు చేయలేదని, సరదా కోసమే అలా చేశానని ఫేస్ బుక్ లైవ్ చాటింగ్ లో చాన్ తెలిపింది. ఇందులో 'సెక్సిస్ట్' విన్యాసం లేదని స్పష్టం చేసింది. న్యూస్ మధ్యలో స్వెటర్ తొడుక్కోమని టీవీ ప్రొడ్యూసర్ చెప్పలేదని, సహ వ్యాఖ్యాతతో కలిసి ఇలా చేశానని వెల్లడించింది. అయితే విమర్శలు ఎక్కువ కావడంతో ఆమె క్షమాపణ చెప్పింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Liberte Chan  KTLA TV anchor  News Reader  Los Angeles  

Other Articles