beer lorry turns up down at moosapet flyover

Boozers and locals festival in moosapet

free beer bottles, free beer in moosapet, boozers fastival in moosapet, beer lorry, beer lorry updown, pivots, boozers, rolls, moosapet flyover, hyderabad

locals and boozers compete to take free beer bottles as beer lorry turns up down at moosapet flyover in hyderabad

మూసాపేటలో బీరుభలుల పండగ.. ఫ్రీ మద్యం కోసం పోటీ..

Posted: 05/07/2016 10:30 AM IST
Boozers and locals festival in moosapet

హైదరాబాద్ మహానగరంలోని మందు బాబులు పండుగ చేసుకున్నారు. మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలు గత కొన్ని రోజులుగా కురిసిన వర్షం ఉపశమనం ఇవ్వగా, మద్యం బాబులు ఫ్రీగా బీరు లభించడంతో వారు వాటిని తమ ఇళ్లకు ఎత్తుకెళ్లి నిల్వ చేసుకునేందుకకు పోటీ పడడ్డారు. అదేంటి ఒక్కో బాటిల్ బీరుకు సుమారుగా వంద రూపాయలు ఖర్చ అవుతుండగా, వీళ్లకు ఫ్రీగా బీరు ఎలా లభించింది. ఎవరైనా పంచారా..? లేక అక్కడేమైనా ఎన్నికలు నిర్వహిస్తున్నారా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయా..? అసలు మందుబాబులు ముఖ్యంగా బీరుబలులు పండగ ఎలా చేసుకున్నారు..? ఎవరైనా బీరును ఉచితంగా పంఫిణీ చేశారా..? అంటే అదేంలేదు. కానీ బీరుబలులు బాటిల్స్ను ఎత్తుకుపోయి ఎంజాయ్ చేసిన ఘటన మాత్రం మూసాపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మూసాపేట ఫ్లైఓవర్పై బీరు లోడుతో వెళ్తున లారీ ఒక్కసారిగా బోల్తా పడింది. డ్రైవర్ రాంగ్‌రూట్‌లో రివర్స్ చూస్తుండగా అదుపుతప్పి లారీ కింద పడింది. దీంతో లారీలోని బీరు బాటిల్స్ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. ఇదే అదునుగా భావించిన మందు బాబులు లారీలోని బీరు బాటిల్స్ను భారీగా ఎత్తుకుపోయారు. ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఫ్లై ఓవర్పై లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అయితే అప్పటికే లారీలోని సరుకు సగం వరకు బీరుబలులు ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer lorry  beer lorry updown  pivots  boozers  rolls  moosapet flyover  hyderabad  

Other Articles