వరంగల్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం | Telabngana govt plans to International Cricekt Stdium in Warangal

Telabngana govt plans to international cricekt stdium in warangal

Cricket, Warangal, Cricket Satium, Cricket Stadium in Warangal, క్రికెట్ స్టేడియం, వరంగల్, వరంగల్ లో క్రికెట్ స్టేడియం

Telangana CM KCR Speciallpy interested in this issue. local govt officals alaso preparing files for that.

వరంగల్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం

Posted: 05/06/2016 04:05 PM IST
Telabngana govt plans to international cricekt stdium in warangal

గ్రేటర్ వరంగల్ రూపు రేఖలు మరికొన్ని రోజుల్లో మారనున్నాయి. జిల్లాలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. దీనికోసం జిల్లాలో అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు గల అవకాశాలు పరిశీలించాలంటూ జిల్లా యంత్రాంగానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. నిధుల మంజూరు, పాలనాపరమైన అనుమతులు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

స్టేడియం నిర్మాణానికి జిల్లాలోని మామునూరు సమీపంలో తిమ్మాపూర్ దగ్గర 16ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మామునూరు పాత ఎయిర్‌పోర్టు, 4వ పోలీస్ బెటాలియన్‌లకు సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసి.. ఇటీవలే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం వరంగల్ అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసి ప్రతీఏడు రూ.300 కోట్లు కేటాయిస్తుంది. దాదాపు 60 వేల మంది సామర్థ్యంతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మించేలా ప్రణాళిక రూపొందించనున్నారు అధికారులు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles