ఆ ఫోటోలు పెట్టిన సమంత | Samantha posted that type pictures in Instagram

Samantha posted that type pictures in instagram

Smantha Cherichella, Samantha, Kiss, Instagram, Pictures, సమంత, సమంత చెరిచెల్లా

Smantha Cherichella, who belongs to Long Island lose a job for her posted pictures. She posted a nude picture of two woman.

ఆ ఫోటోలు పెట్టిన సమంత

Posted: 05/06/2016 01:01 PM IST
Samantha posted that type pictures in instagram

ఈ మధ్యన సంతోషం నుండి బాధ వరకు అన్ని ఫీలింగ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా సమంత కూడా ఇలానే చేసింది. దాంతో అమ్మగారి కాళ్ల దగ్గరికి వచ్చిన 40 లక్షల ఉద్యోగం  చేజారింది. అదేంటి సమంత ఫోటోలు పెట్టడం ఏంటి..? 40లక్షల ఉద్యోగం చెయ్యడం ఏంటి అనుకుంటున్నారా..? సమంత అంటే మన హీరోయిన్ సమంత కాదులెండి. లాంగ్ ఐలాండ్ కు చెందిన సమంతా చెరిచెల్లా అనే అమ్మాయి. ఆ అమ్మడు పెట్టిన ఒక్క ఫోటో వల్ల ఏకంగా 40లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం పోయింది అంటే మామూలు విషయమా. ఇంతకీ అమ్మడు ఏం ఫోటోలు పెట్టిందో తెలుసా..?

సమంతా చెరిచెల్లా అనే అమ్మాయి ఓ కంపెనీకి ఇంటర్వ్యూకు వెళ్లింది. ఆమెను ఇంటర్వ్యూ చేసిన కంపెనీ దాదాపుగా ఓకే చేసింది. ఫార్మాల్టీస్ అన్నీ పూర్తయ్యాయి అనుకున్న టైంలో అనుకోని షాక్ తగిలింది. అమ్మడుకు ఉద్యోగం ఇవ్వడం లేదని కంపెనీ తెలిపింది. అదేంటి అంతా ఓకే అనుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఉద్యోగం ఇవ్వడం లేదంటే వాళ్లు చెప్పిన సమాధానం విని షాకైంది. సమంత ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వల్ల అని తెలిసింది. ఇద్దరు మహిళలు ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న  ఓ ఫోటో వల్ల ఉద్యోగం ఇవ్వలేమని అన్నారు. ఆమె లెస్బియన్ అనే అనుమానంతో ఉద్యోగం ఇవ్వం పో అన్నారు. ఒక్కసారిగా షాక్‌కు గురైన సమంత కోర్టు మెట్లు ఎక్కుతోంది. ఒక కళలా చూడాల్సిన ఫొటోను పోర్న్ అన్నట్లుగా చూస్తున్నారని, తనకు అన్యాయం చేయాలని చూస్తున్నారని వాధిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles