Cigarette pack to cost £23 in Australia and 69 per cent is tax

Australian smokers to be charged 23 for a pack of cigarettes

Cigarettes Australia, cigarettes expensive, tobacco tax Australia, Australia, Smoking, cigarettes, World Health Organisation, tobacco products, Australasia, World, News

An average pack of 25 already costs around £15, which is nearly double the amount they go for over here.

పోగరాయుళ్లకు చేధువార్త.. ఇక డబుల్ రేట్లు

Posted: 05/05/2016 07:13 PM IST
Australian smokers to be charged 23 for a pack of cigarettes

పోగరాయుళ్లకు ఇది చేదు వార్త. అయితే అందరి  పోగరాయుళ్లకు కాదండోయ్, కేవలం విదేశీ సిగరెట్లు ఊదేసే వాళ్లకు ఇక జేబుల్లో డబ్బులు కూడా ఊదేసిన విధంగానే లాగేసుకుంటామని అంటున్నాయి ప్రభుత్వాలు. మన ప్రభుత్వం విదేశీ సిగరెట్లపై ఇప్పటికే సుంకం విధించిన నేపథ్యంలో ఇక విదేశాలు కూడా తమ పౌరుల అరోగ్యంపై దృష్టి సారించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశాలు ఈ మేరకు పెంపును విధించనున్నట్లు సూత్రప్రాయంగా ప్రకటించాయి,

అది ఎంతలా అంటే ఇకపై సిగరెట్లు తాగేవాల్లు ఏకంగా రెండింతల డబ్బులు ఖర్చు చేస్తేకాని ఒక్క సిగరెట్ కూడా కొనలేరు.  ఇప్పటికే అధికధరలున్న ఆస్ట్రేలియాలో మరో నాలుగేళ్లలో 25 సిగరెట్ల ప్యాకెట్‌ ధర 2,300 రూపాయలకు చేరుకోనుందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. పొగాకుపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లపాటు, అంటే 2020 వరకు ఏడాదికి 12.5 శాతం పెంచాలని ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్ణయించడమే ఇందుకు కారణమని ఆ వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఓ సర్వే ప్రకారం ఇప్పటికే మెల్‌బోర్న్‌లో మార్ల్‌బోరో సిగరెట్‌ ప్యాకెట్‌ను దాదాపు 1270 రూపాయలకు విక్రయిస్తుండగా, సిడ్నీలో 1165 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ సిగరెట్‌ ప్యాకెట్లను పారిస్‌లో 524 రూపాయలకు, అట్టావాలో 599 రూపాయలకు విక్రయిస్తున్నారు. అంటే, ఆ నగరాలకన్నా రెట్టింపు ధరలకు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఇవే సిగరెట్‌ ప్యాకెట్లను లండన్‌లో 920, న్యూయార్క్‌లో 895 రూపాయలకు విక్రయిస్తున్నారు. పొగాకుపై ప్రపంచంలోకెల్లా ఎక్కువ ఎక్సైజ్‌ పన్నును విధించిన దేశం ఆస్ట్రేలియానేనని ఇంపీరియల్‌ అమెరికా టొబాకో కార్పొరేట్, లీగల్‌ వ్యవహారాల అధిపతి ఆండ్రీవ్‌ గ్రెగ్‌సన్ తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Smoking  cigarettes  World Health Organisation  tobacco products  

Other Articles