రాజధాని పొలాల్లో పవన్ ఫ్లెక్సీలు | farmers fix Janasena President Pawan kalyan flexis in fields

Farmers fix janasena president pawan kalyan flexis in fields

Pawan Kalyan, Janasena, Pawan Kalyan flexi, AP, Amaravathi, Penumaka, Undavalli, పవన్ కళ్యాణ్, ఏపి, అమరావతి, పెనుమాక, జనసేన

Many farmers from Undavalli and Penumaka, arranging Pawan Kalyan flexis. They demand to leaves their lands which will not included in AP Capital.

ITEMVIDEOS: రాజధాని పొలాల్లో పవన్ ఫ్లెక్సీలు

Posted: 05/05/2016 03:04 PM IST
Farmers fix janasena president pawan kalyan flexis in fields

ఎపి రాజధాని ప్రాంత పొలాల్లో హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు రైతులు ఏర్పాటు చేశారు. ఉండవల్లి, పెనుమాక రైతులకు పవన్ అండగా ఉంటానని హామీ ఇచ్చి ఇప్పుడు కనపడటం లేదన్నారు. రాజధానికి అవసరం లేని భూములను రైతులకు ఇవ్వాలని ఆప్రాంత రైతులు కోరుతున్నారు. రైతుల వద్ద నుండి బలవంతంగా తీసుకుంటే రైతుల తరుపున పోరాడుతామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కూడా ఏపి రాజధాని పరిసర గ్రామ రైతుల భూములను లాక్కుంటే తాను చూస్తూ కూర్చోనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చిరంచారు. మోదీ సర్కార్ కు, అవసరం అయితే చంద్రబాబు నాయుడు సర్కార్ కు కూడా తాను ఎదురువెళతానని తేల్చి చెప్పాడు. మరోసారి రాజధాని రైతులు పవన్ పేరును జపిస్తుండటంతో ఏపి మంత్రులకు, టిడిపి నాయకులకు చెమటలు పడుతున్నాయి. ఇది చిలికి చిలికి గాలి వానగా మారక ముందే తమ అధినేత ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని వారు అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles