హెల్మెట్ లేదని కారు డ్రైవర్ కు ఫైన్ | Car driver challaned for not wearing helmet in Goa

Car driver challaned for not wearing helmet in goa

Helmet, Goa, Police, Traffic Police, Fine for Car Driver, No Helmet, హెల్మెట్, కారు డ్రైవర్, గోవా

In a faux pas, the Goa Traffic Police has issued challan to a car driver for not wearing helmet while driving. Police Sub-Inspector S L Hunashikatti, attached to the traffic cell in Colva, issued the challan on Tuesday to one Eknath Anant Palkar for not wearing helmet when he was driving his car in a village near South Goa’s Colva beach.

హెల్మెట్ లేదని కారు డ్రైవర్ కు ఫైన్

Posted: 05/04/2016 04:04 PM IST
Car driver challaned for not wearing helmet in goa

హెల్మెట్ లేకుండా బైక్ నడిపించే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.  మన దగ్గర హైకోర్టు కలగజేసుకొని మరీ హెల్మెట్ ను ఖచ్చితంగా పెట్టుకోవాలంటూ ఆర్డర్ పాస్ చేసింది. దాంతో పోలీసులు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే చాలు పట్టేసి.. ఫైన్ వేస్తున్నారు. బైక్ నడిపే వాళ్ల ప్రాణాలను కాపాడాలన్న సదుద్దేశంతోనే ఈ నిబంధన విధించారు. అయితే.. గోవాలో మాత్రం ట్రాఫిక్ పోలీసులకు ఉన్నట్టుండి ఏం బుద్ధి పుట్టిందో గానీ... హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటూ ఓ కారు డ్రైవర్ కు జరిమానా విధించారు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం. కారు డ్రైవర్ కే హెల్మెట్ లేదని ఫైన్ వేశారు.

గోవాలోని ఓ ప్రాంతంలో డ్యుటీ చేస్తున్న ట్రాఫిక్ ఎస్సై ఎస్.ఎల్ హనుషికట్టి ఓ కార్ ను ఆపాడు. అసలే పోలీసులు కాబట్టి ఎందుకులే అనుకున్కన ఏక్తాధ్ అనంత్ పాల్కర్ అనే కారు డ్రైవర్ దాన్ని పక్కకు ఆపాడు. ఆ వ్యక్తి హెల్మెట్ లేకుండా కోల్వా బీచ్ సమీపంలోని ఓ గ్రామంలో కారు నడుపుతుండగా.. ట్రాఫిక్ ఎస్ఐ ఎస్ఎల్ హనుషికట్టి అతడిని పట్టుకుని చలానా రాశారు. మోటారు వాహన చట్టంలోని 177 సెక్షన్ కింద అతడిని బుక్ చేశారు.ఆ సెక్షన్ ప్రకారం, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధించొచ్చు.  కానీ ఆ వ్యక్తి నడుపుతున్నది కారు కావడం విశేషం. దాంతో ఏం జరిగిందా అని పోలీసులు, మీడియా వాళ్లు ఆరా తీశారు. ఎస్సై వేరే సెక్షన్ రాయబోయి.. మరో సెక్షన్ తో జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles