It's Official Now, TDP Arm-Twisting Media!

Kommineni gives clarification on ksr live show

Chandrababu Naidu, Kommineni, Live With KSR, Media, NTV, Andhra Pradesh, ksr live show, kommineni, clarification, senior journalist, andhra pradesh politics, ruling party suspressing journalists

NTV has stopped “Live with KSR” in the morning hours under pressure from powers-that-be, senior journalist Kommineni Srinivasa Rao finally spilled the beans as to why he had to discontinue the show.

మీడియాలో పచ్చి (పచ్చ) నిజాలు

Posted: 05/03/2016 10:56 AM IST
Kommineni gives clarification on ksr live show

జర్నలిజం అనేది ఓక ఆయుధం. సత్యాసత్య అన్వేషణలో క్రీయాశీలక పాత్ర పోషించి.. యదార్థాన్ని మాత్రమే ప్రజలకు అందించే కీలక రంగం. అందుకనే మన ప్రజాస్వామ్య దేశంలో నాలుగో మూలస్థంభంగా గుర్తింపు పోందింది. వారపత్రికలు, మాసపత్రికలు, పక్ష పత్రికల నుంచి చిన్న చిన్న దినపత్రికలు వరకు ఆ తరువాత రాష్ట్రస్థాయి దినపత్రికలు, జిల్లా టాబ్లాయిడ్ లు, జోన్ లు ఇలా అనేకం వచ్చిరాగానే జర్నలిజంలోకి అనుకోకుండానే కార్పోరేట్ సంస్థల గుప్పిట్లలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి రాజకీయ పార్టీల చేతుల్లోకి పయనమయ్యింది.

ఇక యాజమాన్యాలు చెప్పినట్లే నడుచుకోవాలనే ధోరణి, మా యాజమాన్యం పలానా పార్టీకి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించదని, వారి గురించి మా పత్రికలో పెద్ద పెద్ద అక్షరాలతో పతాక శీర్షకలు పెట్టి రాస్తామని గ్రామీణ విలేకరులు సైతం చెప్పుకునే స్థాయికి జర్నలిజం విలువలు పడిపోయాయి. మరికొన్ని యాజమాన్యాలైతే తమ ప్రముఖ పాత్రికేయులను ఫలనావాడిపైనే నిఘా పెట్టండి, వారి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండని టార్గెట్ చేస్తూ కూడా అదేశాలు జారీ చేస్తూ కథనాలను ప్రచురిస్తున్నాయి.

సరే వారి పత్రిక, వారిష్టం అని గమ్మునుండే వారి సంఖ్య కొంత. అసలేం జరుగుతుందో తెలియని వారి సంఖ్య మరికోంత.. ఈ దారుణాన్ని ప్రశ్నించాలనే వారి సంఖ్య ఇంకోంత.. మాకు ఉదయాన్నే తాజా వార్తలను అందించాల్సిన ప్రతిక వచ్చిందా రాలేదా అని ఎదురుచూసే వారి సంఖ్య జగమంత. ఇలా ఎవరి పరిధి వారికుంది. కానీ జర్నలిజం అంటే అర్థం తెలిసి.. జర్నలిస్టుల అకలి బాధలు తెలిసిన సంస్థలు ఎన్ని వున్నాయంటే...?

దినసరి కూలీలు జీతం రోజుకు నాలుగు వందలు, అడ్డా కూలీల జీతం 400 అయినా జర్నలిస్టుల జీతం లో మాత్రం ఎంతో వ్యత్యాసం. తమ వాడు అయితే చాలు బంతిలో ఎక్కడ కూర్చున్నా వచ్చి వడ్డించే యాజమాన్యాలు, వాటి కోటారీలు వున్న నేటి సమాజంలో జర్నలిజం అర్థం తెలియని వారు కూడా మహానగరంలో మహారాజులుగా చెలామణి అవుతున్నారు. దినసరి కూలీలకన్న తక్కువ వేతనానికి పనిచేస్తున్న పిచ్చి మహారాజులు, కలమే మా బలం అని నమ్మె వారు లేకపోలేదు. ఈ పోరులో విలువలకు ప్రాధన్యమిచ్చే నిజమైన పాత్రికేయులు మాత్రం నలిగిపోతున్నారు.

నిజాలు చెప్పడమే నేరమా..? సత్యశోధన చేయడమే పాపమా..? అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు జర్నలిస్టులకు వుండే మర్యాద.. గౌరవాలు కాంపటీషన్ వరల్డ్ లోకి వచ్చేసరికి సునామీలో కొట్టకుపోయాయి. పోటీతత్వంలో ఏది వార్త, ఏది వార్త కాదన్న విషయం మర్చిపోయి.. చిన్న ఘటన కూడా బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఈ పోటీ మరింతగా పెరిగి.. రేటింగ్ ల కోసమే తప్ప.. ప్రజలకు ఉపయోగపడని వార్తలకు కూడా ప్రాధాన్యం పెరిగిపోతుంది. ఏది బ్రేకింగ్, ఏది అప్ డేటో తెలియని పరిస్థితికి దిగజారుతుంది.

ఇక ఏదో ఒక పార్టీలో తాము క్రీయాశీలక నేతగా వ్యవహరించాలంటే తమకు మీడియా సఫోర్టు వుండాలని రాజకీయ నేతలు భావిస్తున్నారు, ఇందులో తప్పులేదు. అయితే ఇది ఒకనాటి నేతలకు మాత్రమే పరిమితం. ఇప్పటి నేతలు మాత్రం తాము ఎవరినో ఎందుకు బతిమాలడం.. తామే మీడియా ఛానెల్ ను పెడితే పోలా, పత్రికను పెడితే పోలా అంటూ రాజకీయ నేతలే మీడియాను తమ చేతుల్లోకి తీసుకోవడం, వారిని నమ్మినబంటును దానికి ఇవ్వడం వారికి భజన చేసే వారికి తాయిలాలు ఇవ్వడం ద్వారా కూడా నిజమైన జర్నలిజం, జర్నలిస్టుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి.

బ్యాంకులకు వందల కోట్ల రూపాయలను ఎగవేసో, లేక ఓ బడా నేతకు బినామీగానో వుంటూనో, లేక మరేమార్గంలోనైనా సరే.. ఒక మీడియాకు వుంటే చాలుకునే వాళ్లే.. ఒక ఛానెల్ ను తీసుకోవడం.. వాటిని నడిపించడం, లేదా ఒక పత్రికను స్థాపించడం నాలుగు డబ్బులున్న నేటి రాజకీయ నేతలకు పరిపాటిగా మారింది. సరే అనుకునేందుకు కూడా వీలు లేకుండా.. ఈ రంగాన్ని నచ్చి, మెచ్చి వచ్చిన జర్నలిస్టులకు చాలీచాలని వేతనాలతో కడుపులు మాడ్చుకుంటున్నారు. సీనియర్ జర్నలిస్టులు కూడా పరాభవాలకు లోనవుతున్నారు.

ఇక తాజాగా ఈ పరిస్థితి మరింతగా దాపురించి.. ఏకంగా రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా అధికారంలో వున్న పార్టీలు, వాటి నేతలు మీడియాలను శాసిస్తున్నారు. తన వాగ్ధాటి, నిఫ్పక్షపాత వైఖరి, నిర్మోహమాట ప్రశ్నలతో రాజకీయ నేతలను, అధికార, విపక్షాలను ఇబ్బంది పెట్టైనా సరే సత్యాన్వేషణ సాగిస్తున్న.. ప్రజలకు నిజానిజాలను అందజేస్తున్న కొమ్మనేని లాంటి సీనియర్ జర్నలిస్టుపైనే కత్తి నూరారు. కత్తి కన్నా కలం గొప్పదని ఇప్పటికీ నడి వీధిలోకి వచ్చి చాటిచెప్పే నాయకులు, అధికార పక్ష నేతలు.. నిస్సిగ్గుగా తెరవెనక చేసే చర్యలతో మాత్రం కలం, కత్తి కాదు అధికారానిదే బలమని రుజువు చేస్తున్నారు.

పచ్చపాము పడగ నీడలో నానాటికి ఇంత వటుడింతే అన్నట్లుగా పెరిగిపోయి, ఎదిగిపోయి, ఆ పార్టీకి అన్ని తామే.. వారు ఇబ్బందులలో వుంటే ఎలా అధిగమించుకుని రావాలన్న కథనాలను ప్రచురించి, ప్రసారం చేసే పచ్చ మీడియా జర్నలిజం విలువలపై పడే చావుదెబ్బలకు సమాధానం చెప్పలేవా..? కాకి ప్రమాదం సంభవిస్తే.. దాని చుట్టూ కాకులు ముసురుతాయి అన్న విషయం తెలిసినా.. ఏ పత్రికారంగంలోని పెద్దాయనకు గత రెండు మాసాలుగా అధికార రాజకీయ పార్టీ చదరంలో పావును చేసి అడిగించినా ఎందుకు పట్టదు..? అధికార పార్టీ తన దృతరాష్ట్ర కౌగిలిలో కొమ్మినేని బంధించిందన్న అరోపణలు వస్తున్నాయి.

ఇది ఇలాగే కొనసాగనిస్తే.. మరెందరో నిష్పక్షపాత జర్నలిస్టులు వృత్తులకు దూరం అవుతారు. దీంతో నిజాలు ప్రజలకు అందుబాటులోకి రావు. అయితే  కానీ ఇది కేవలం మిడిసిపాటు మాత్రమే అవుతుంది. ఇప్పటికైనా తమ చేసిన తప్పును రాజకీయ పార్టీ నేతలు సరిదిద్దుకోవాలి. జర్నలిస్టుల సత్యశోధనను ఆపడం అంటే అరచేతితో ఉదయిస్తున్న సూర్యడిని అపడమే అవుతుంది. సూర్యకాంతి లోకాన్ని తాకక తప్పదు.. నిజం ప్రజలకు తెలియాక మానదు. ఈ విషయం కూడా అధికార, విఫక్ష పార్టీలు తెలుసుకుంటే సరి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntv  ksr live show  kommineni  clarification  senior journalist  andhra pradesh politics  

Other Articles