Man arrested for abducting woman, attempting sexual assault

Woman victim says accused called her whore

woman kidnapped, woman dragged, woman grabbed, cctv, cctv video, woman caught, bengaluru, kidnapped, crime against women

The man, who abducted a woman just outside her house in Bengaluru, has been arrested. He has been identified as Akshay, and is a 24-year-old cab driver.

ITEMVIDEOS: బెంగళూరు అత్యాచారయత్న నిందితుడు అరెస్ట్..

Posted: 05/03/2016 09:25 AM IST
Woman victim says accused called her whore

బెంగళూరులో సంచలనం రేకెత్తించిన యువతి అత్యాచారయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన పెయింగ్ గెస్ట్‌ గది ఎదురుగా ఫోన్‌లో మాట్లాడుతున్న బాధితురాలిని అమాంతం ఎత్తుకెళ్లి.. అత్యాచారయత్నం చేసిన నిందితుడి వీడియోలు బయటకు వచ్చిన 24 గంటలు గడవక ముందే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని అక్షయ్ గా గుర్తించిన పోలీసులు అతనోక క్యాబ్ డ్రైవర్ అని కూడా గుర్తించారు, ఈ వీడియో బయటకు రావడంతో అటు బెంగళూరు సహా.. జాతీయ స్థాయిలో ఈ ఘటన సంచలనం రేపడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని సీసీ కెమెరాల అధారంగా గుర్తించి అరెస్టు చేశారు.

కాగా అంతకు కొన్ని రోజుల ముందు వరకు కూడా ఇలాంటి ఘటనే స్థానికంగా జరగడంతో దానిని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కూడా నిందితుడు అక్షయ్ ప్రమేయం ఏమైనా వుందా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే రోడ్డుపై నిల్చుని ఫోన్ మాట్లాడుతున్న యువతిని ఎత్తుకెళ్లడం పరిశీలించిన పోలీసులు నిందితుడు ఇలాంటి ఘటనలకు ఇంతకుముందు కూడా పాల్పడి వుంటాడన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని విచారిస్తే కానీ తమకు పూర్తిగా వివరాలు తెలియవని పోలీసులు చెబుతున్నారు.

అయితే పెయింగ్ గెస్ట్‌ గది ఎదురుగా  ఫోన్‌లో మాట్లాడుతున్న తనను అమాంతం ఎత్తుకెళ్లి.. అత్యాచారం చేసేందుకు ఓ దుండగుడు ప్రయత్నించాడని, తనను అనరాని మాటలంటూ, 'వేశ్య' అని ఘోరంగా తిడుతూ అతడు తనపై అఘాయిత్యం చేయబోయాడని బెంగళూరు బాధితురాలు వెల్లడించింది. బెంగళూరులోని కట్రిగుప్ప వద్ద గత నెల 23న తనపై జరిగిన అత్యాచార యత్నం గురించి తాజాగా ఆమె మీడియాతో మాట్లాడింది. తనపై అత్యాచార యత్నం చేయబోయిన వ్యక్తిని తాను గుర్తిస్తానని స్పష్టం చేసింది.

ఆ సమయంలో తాను కేకలు పెట్టిన ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ' నా పెయింగ్‌ గెస్ట్ గది ఎదురుగా నేను ఫోన్‌లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వెనుకవైపు నుంచి వచ్చి అమాంతం నన్ను ఎత్తుకున్నాడు. నన్ను ఓ జంతువులా పట్టుకొని దగ్గర్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్దకు తీసుకెళ్లాడు. నాకు ఏం జరుగుతుందో కూడా కొంతసేపు అర్థం కాలేదు. నన్ను కిందపడేసి నాపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అతనితో పోరాడాను. అతన్ని వెనక్కినెట్టి పరిగెత్తాను.

నా జట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి మళ్లీ నేలపై పడేశాడు. నేను గట్టిగా అరుస్తూ ఏడ్చాను. ఎవరూ నన్ను రక్షించేందుకు ముందుకురాలేదు. చివరకు అతని చేయి గట్టిగా కోరికి.. అతన్ని నుంచి తప్పించుకొని నా గదివైపు పరిగెత్తాను' అని బాధితురాలు వివరించింది. బాధితురాలి కుటుంబసభ్యులు మణిపూర్‌కు చెందినవారు. కాగా బెంగుళూరులో ఈశాన్య రాష్ట్రవాసులపై ఈ మధ్యకాలంలో అనేక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన కలకలం రేపింది, బెంగళూరులోనే పుట్టి. పెరిగిన ఆమె ప్రస్తుతం ఓ బ్యూటీ క్లినిక్‌లో పనిచేస్తోంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abduction  bengaluru  CCTV  woman  rape  

Other Articles