Serena Williams Gets an Earful Over Photoshopped Image

Serena williams deletes photoshopped picture after fan backlash

adam voges, voges injury, adam voges australia, voges middlesex captain, middlesex vs hampshire, sports news, sports, cricket news, cricket

Serena Williams, the greatest tennis player in the world, has found herself in the midst of a photoshopping furore.

అభిమానుల అగ్రహం.. ‘ఆ’ ఫోటోను తొలగించిన సెరినా..

Posted: 05/03/2016 08:46 AM IST
Serena williams deletes photoshopped picture after fan backlash

నాజుకు అందం నీ సోంతం, నాజుకు నడుము ఒంపు నీకే సోంతం అంటూ తెలుగు కవుల వర్ణనను తెలుసుకుందో ఏమోగానీ టెన్నీస్ స్టార్ ప్లేయర్ సెరినా విలియమ్స్.. తన నడుమును సన్నగా చేసుకుంది, అ ఫోటోను తన ఇస్ట్రాగ్రామ్ లో పెట్టిపెట్టగానే అమె అభిమానుల నుంచి అమెకు వెల్లువలా కామెంట్లు వచ్చేశాయి. అంతే ఎవరికైనా అంతలా తన ఫోటోకు లైక్ లు, కామెంట్లు వస్తే ఎంత సంతోషమో. అయితే సెరినాకు మాత్రం ఆ కామెంట్ల ఎంతమాత్రం రుచించలేదు, అందుకనే తాను ఫోస్టు చేసిన ఫోటోను గంటల వ్యవధిలోనే తొలగించేసింది.

ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే 31 లక్షల మంది ఫాలోవర్లు కలిగిన సెరీనాను.. ఫేస్ బుక్, ట్విట్టర్ లను కలుపుకొంటే 87 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. గ్రాండ్ స్లామ్ లతోపాటు నెటిజన్ల అభిమానాన్ని కూడా చూరగొన్న ఈ నల్ల కలువకు 'సోషల్ మీడియా చాంపియన్'అని అవార్డులు కూడా వచ్చాయి. అలా సెరీనాను విపరీతంగా ఆరాధించే ఫ్యాన్స్ ఇటీవల ఆమె స్విమ్ సూట్ ధరించిన ఫొటో విషయంలో మాత్రం తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్ ఆఫ్ 2016' శీర్షికతో ప్రఖ్యాత పీపుల్స్ మాగజైన్ ఓ సంచికను రూపొందిస్తోంది. అందులో భాగంగా 34 ఏళ్ల సెరీనా విలియమ్స్ హాట్ హాట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ఫొటోషూట్ విశేషాలను అభిమానులకు తెలియజేస్తూ నల్లని స్విమ్ సూట్ ధరించిన ఫొటో ఒకదానిని సెరీనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్షణాల్లోనే లక్షల మందికి చేరిపోయిందా ఫొటో. అంతే, సెరీనా చర్యకు అభిమానులు నొచ్చుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే..

సెరీనా పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె నడుము భాగం ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, సన్నగా(ఫొటోషాప్ తో మార్పులు చేసి) కనిపించింది. అభిమాన క్రీడాకారిణి ఎలా ఉంటుందో తెలుసుకాబట్టి ఆ ఫొటో చూసి విస్తుపోయారు ఫ్యాన్స్! ఎందుకిలా ఫొటోషాప్ చేసిన ఫొటోను పోస్ట్ చేశావ్? అంటూ నిమిషాల వ్యవధిలోనే వందలమంది అభిమానులు సెరీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో కంగుతిన్న సెరీనా.. రెండు గంటల్లోపే మొదటి ఫొటోను డిలిట్ చేసి, ఒరిజినల్ ఫొటోను పోస్ట్ చేసింది. అయితే రెండో ఫొటోపైనా కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పాపం సెరీనా!

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swimsuit photo  Tennis superstar Serena Williams  People Magazine  fans backlash  

Other Articles