చీమలు కుట్టి చిన్నారి మృతి | new bron baby died after ants bite

New bron baby died after ants bite

Vijayawada, Guntur, Ants, Dogs, Govt Hospitals, విజయవాడ, గుంటూరు, ప్రభుత్వాసుపత్రి

In Viajayawada Govt Hospital, A new born baby died. Ants in the hospital bite that baby.

చీమలు కుట్టి చిన్నారి మృతి

Posted: 05/02/2016 04:39 PM IST
New bron baby died after ants bite

మొన్నామధ్య గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కరిచి 21 రోజుల బాలుడు మరణించాడు. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు మరణించాడు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో పిల్లల విభాగంలో లక్ష్మి అనే మహిళకు నాలుగు రోజుల క్రితం సిజేరియన్‌ ఆపరేషన్‌ చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో అందరూ సంతోషించారు. కానీ సోమవారం తెల్లవారుజామున లేచి చూడగా.. శిశువు ఛాతీ, వీపు భాగాల్లో చీమలు కుట్టి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పటికే శిశువు మరణించాడు. పిల్లాడిని మొత్తం చీమలు కుట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా వైద్యులు మాత్రం తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని, అందుకే మరణించాడని వైద్యులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles