Congress claims PM Narendra Modi has two dates of birth, asks him to clear air

We dont mind an illiterate pm but we do mind his honesty

Narendra Modi, Digvijay singh, date of birth, correct age, modi date of birth, modi educational qualifications, discrepancies, PM modi, Gujarat University, Delhi, Congress, Arvind Kejriwal, Ahmedabad

Amid a row surrounding Prime Minister Narendra Modi's educational qualifications, Congress today alleged "discrepancies" in his date of birth.

ఏడాది వయస్సును ఎందుకు దాచేస్తున్నారు..?

Posted: 05/02/2016 02:12 PM IST
We dont mind an illiterate pm but we do mind his honesty

దేశ ప్రధాని నరేంద్రమోడీ ఒక సంవత్సరం వయస్సును దాచేస్తున్నారా.? అయనకెందుకలా చేస్తున్నారు. సహజంగా అమ్మాయిలు వయస్సును, అబ్బాయిల వేతనాన్ని అడగోద్దని పెద్దలంటారు. కానీ ప్రధాని తన వయస్సును దాచే ప్రయత్నం చేస్తున్నారని విఫక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రధాని విద్యార్హతలు ఏంటో తెలపాలని, యావత్ దేశ ప్రజలు  ఆయన విద్యార్హతలను తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే సివీసీకి లేఖ రాయగా, ప్రధాని చదువు లేకపోయినా పర్వాలేదు కానీ ఆయన అసలు వయస్సెంతో చెప్పాలని మరోకరు ప్రశ్నిస్తూ.. ఆయనను ఇబ్బందికర పరిణామాలకు తెరతీస్తున్నారు.

ఇందుకు కారణం ఏటంటే.. ప్రధానికి రెండు పుట్టినరోజులు ఉండటమే. నిజమేనండీ.. మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి రెండు జన్మదినాలు వున్నాయి. అంటే ఆయన బాల్యంలో వున్న జన్మదినానికి, ఆయన ప్రధాని అయ్యాక ఆయన వెబ్ సైట్ లో వున్న జన్మదినానికి వత్యాసం సుమారుగా ఏడాది ఒక మాసం. అంటే సుమారుగా 13 నెలలన్నమాట. ఈ వ్యత్యాయం ఎందుకోచ్చిందో తెలియదుకానీ.. ఇప్పుడు విఫక్షాలు మాత్రం ఈ రెండింటిలో మోడీ అసలైన జన్మదినం ఏదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.  విస్‌నగర్‌లోని ఎమ్మెన్ కాలేజీ రికార్డుల్లో మోదీ పుట్టిన రోజు ఆగస్టు 29, 1949 అని నమోదై ఉండగా, ప్రధాని అధికారిక వెబ్‌సైట్లో మాత్రం సెప్టెంబర్ 17, 1950 ఉండటంలో విపక్షాలు తీవ్రవిమర్శలు చేస్తున్నాయి.

తాజాగా ఈ విషయమై తక్షణమే ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయానికి విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజును నిర్ధారణ చేసుకోవడానికి హై స్కూల్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్కు సంబంధించి సర్టిఫికెటన్లను ప్రధాని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. చదువు రాని ప్రధాన మంత్రి అయినా మాకు ఫర్వాలేదు, కానీ ప్రధాన మంత్రి తన విద్యార్హత, పుట్టిన తేదీ విషయంలో నిజాయితీగా లేకపోతే మాత్రం మేము సహించేది లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Digvijay singh  Gujarat University  Delhi  Congress  Arvind Kejriwal  Ahmedabad  

Other Articles