పెళ్లి కావాలంటున్న కేసీఆర్ కూతురు | KCR Daugter need marriage

Kcr daugter need marriage

KCR, KCR Daughter, KCR Adopted Daughter, KC family, KCR Daughter Marriage, కేసీఆర్, కేసీఆర్ కూతురు, కేసీఆర్ కూతురి పెళ్లి

Telangana cm KCR daughter need marriage. KCR adopted Daugter Prathyusha need marriage, not studies.

పెళ్లి కావాలంటున్న కేసీఆర్ కూతురు

Posted: 05/02/2016 12:43 PM IST
Kcr daugter need marriage

తెలంగాణ సిఎం కేసీఆర్ కూతురు తనకు చదువు మీద ఇంట్రస్ట్ లేదని కాబట్టి పెళ్లి చెయ్యాలని పట్టుబట్టిందట. దాంతో ఏం చెయ్యాలో అర్థంకాక.. దీని మీద ఎంక్వైరీ చేయిస్తున్నారట కేసీఆర్. దీన్ని గమనించి వాళ్లు మాత్రం పాపం కేసీఆర్ కు ఎంత కష్టం వచ్చింది అని అనుకుంటున్నారట. ఇంతకీ ఇక్కడ కేసీఆర్ కూతురు అంటే ఎవరో తెలుసా..? కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూష. సవతి తల్లి చేతుల్లో నెలల తరబడి చిత్రహింసలు గురైన విషయం తెలిసిందే. స్వచ్చంద సంస్ధల ద్వారా బయటపడ్డ ప్రత్యూష ఎలాగో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంటికి చేరింది.అప్పటి నుండి ఆమెను కేసీఆర్‌ దత్తత తీసుకున్నారు.

ప్రస్తుతం ప్రత్యూష వయస్సు 19 సంవత్సరాలు. మహిళ శిశు సంక్షేమ హస్టల్‌ ఉంటూంది. ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో చదువుకుంటుంది. ప్రత్యూష చదువు ,పెండ్లి కూడ చేస్తానని గతంలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ప్రత్యూషకు హఠాత్తుగా పెండ్లిపై మనస్సు మళ్లీంది. తాను చదువుకోనని..వెంటనే పెండ్లి చేయాలని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారులకు తెల్చిచెప్పినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని అధికారులు హై కోర్టుకు..సిఎంవో కార్యాలయాలనిక తెలియజేశారు. అయితే హై కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించే వరకు ప్రత్యూష ఆ అబ్బాయిని కలిసేందుకు అనుమతించవద్దని అదికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇదే విషయమై సిఐడి ఎంక్వైరీ కూడ వేసినట్టు సమాచారం. ప్రత్యూష ప్రెమించింది కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డకు  చెందినవాడుగా..ఓ ఆటోమోబైల్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించట్లు తెలుస్తుంది. చూడాలి దత్తత కూతురి విషయంలో సిఎం కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles