Pathankot Boy Seriously Injured While Taking Selfie with Revolver

Pathankot boy sustains bullet injury while taking selfie

pathankot, pathankot boy selfie, pathankot boy gun selfie, pathankot boy selfie gun, pathankot man selfie

The Pathankot boy reportedly tried to take a selfie with the gun pointing towards his head, said police.

సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న కుర్రాడు..

Posted: 05/01/2016 10:08 AM IST
Pathankot boy sustains bullet injury while taking selfie

సెల్ఫీల కోసం ఫోజులిస్తూ ఎందరో యువత ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మద్య ఈ తరహా ఘటనలు మరీ అధికమవుతున్నాయి. రైలుపైకి ఎక్కి సెల్పీలకు ఫోజులిస్తూ పలువురు, ప్రమాదపు అంచులలో నిలబడి సెల్పీలు దిగుతూ మరికోందరూ.. ఇలా అనేక ఘటనలలో సెల్పీల మోజులో ప్రాణాలను కొల్పోతున్నవారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇక మరికొందరు మూగ జీవాల ప్రాణాలను కూడా హరిస్తున్నారు.

 మొత్తానికి సెల్పీల కున్న విలువ ప్రాణాలకు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నా.. వాటిని ఏ మాత్రం యువత పట్టించుకోవడం లేదు. సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన పఠాన్‌కోట్‌లో జరిగింది. అయితే కుర్రాడి అదృష్టం బాగుండి ప్రాణాపాయం తప్పింది. పఠాన్‌కోట్‌కు చెందిన గురుకృపాల్‌ సింగ్‌ కాంట్రాక్టరు. అతని వద్ద లైసెన్స్‌డ్ రివాల్వర్‌ ఉంది. శుక్రవారం తెలిసిన వారింట్లో శుభకార్యానికి భార్యను తీసుకొని వెళ్లాడు.

ఇంట్లోనే ఉన్న అతని కుమారుడు, 15 ఏళ్ల అమన్‌దీప్‌ సింగ్‌ సొరుగులోంచి రివాల్వర్‌ తీసి సోదరితో కలసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. రివాల్వర్‌ను కణతకు ఆనించుకొని సెల్ఫీకి ఫోజిచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్‌పై వేలుపడి రివాల్వర్‌ పేలింది. తుపాకీ శబ్ధం విన్న ఇరుగుపొరుగు వచ్చి చూడగా అమన్‌దీప్‌ గాయపడి  ఉన్నాడు. అతని తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను లూథియానాలోని దయానంద్‌ మెడికల్‌ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pathankot  selfie with gun  boy injured  gurkrupal singh  

Other Articles