బిజెపికి పవన్ సాఫ్ట్ వార్నింగ్ | pawan Kalyan gave soft warning to BJP

Pawan kalyan gave soft warning to bjp

pawan kalyan, pawan kalyan Tweets, janasena, Special Status, AP, Chandrababau Naidu, BJP, Modi, పవన్ కళ్యాణ్, జనసేన, ప్రత్యేక హోదా

Janasena President and Power Star pawan kalyan gave soft warning to BJP. He rise the issue of Specicla status for the state of AP.

బిజెపికి పవన్ సాఫ్ట్ వార్నింగ్

Posted: 04/30/2016 04:35 PM IST
Pawan kalyan gave soft warning to bjp

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి బిజెపి పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఓ రకంగా సుతిమెత్తగా బారతీయ జనతా పార్టీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. నిన్న పార్లమెంట్ లో చోటుచేసుకున్న పరిణామాల దృశ్యా.. ఏపికి ప్రత్యేక హోదా మీద నడుస్తున్న వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాన్ తాజాగా ట్వీట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడం కుదరదు అని కేంద్రం నిన్న కుండ బద్దలు కొట్టిన నేపథ్యంలో పవన్ బిజెపి పార్టీకి ఝలక్ ఇస్తూ ట్వీట్ చేశారు.

Also Read: పవన్ కళ్యాణ్ ఛానల్ పెడతున్నాడా...? 

ఏపికి ఇప్పటికే ప్రత్యేక హోదా కల్పించలేదని గుర్రుగా ఉన్న ప్రజలకు మరింత కోపం తెప్పించేలా నిన్న పార్లమెంట్ లో ప్రకటన వచ్చింది. ఏపికి విభజన చట్టంలోని హామీలను మాత్రమే నెరవేరుస్తామని అంతేకానీ ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీని మీద పవన్ తాజాగా ట్వీట్ చేశాడు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సీమాంధ్ర ఎంపీలను తన్ని పార్లమెంట్ లోంచి బయటకు గెంటి ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి కాంగ్రెస్ ఘోరమైన తప్పు చేసిందని. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బిజెపి కూడా అలాంటి తప్పే చేస్తుందని తాను అనుకోవడం లేదని పవన్ ట్వీట్ చేశారు.

Also read: ఏపిలో .జనసేన మరోప్రస్థానం

ఏపికి ప్రత్యేక హోదా గురించి ప్రజలు రోడ్డ మీదకు వచ్చి ఉద్యమించే లోపు అదికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కలుపుకొని పార్లమెంట్ లో దీని మీద పోరాటం చెయ్యాలని సీమాంధ్ర ప్రజల తరఫున తాను విన్నవించుకుంటున్నానని పవన్ ట్వీట్ చేశారు. దాంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద మరింత వత్తిడి పెరిగినట్లైంది. అసలే కష్టాల సుడిగుండంలో ఉన్న చంద్రబాబుకు పవన్ ఎదురు నిలిచి ప్రత్యేక హోదా కోసం గళమెత్తితే మాత్రం కష్టమని తెలుసు. కాగా దీని మీద పవన్ ఎలా ముందుకు వెళతారో అని రాజకీయ పరిశీలకులు క్షుణంగా గమనిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles