Anil Kapoor feels what happened with MS Dhoni is unfortunate

What happened to dhoni is very unfortunate anil kapoor

anil kapoor, Bollywood, cricket, IPL, MS Dhoni, mahendra singh dhoni, Amrapali, brand ambassador, real estate, AmrapaliMisuseDhoni

Actor Anil Kapoor says that endorsing brands comes with a lot of responsibility but one can’t presume the legitimacy of a particular company in the long run.

అలా జరగడం దురధృష్టకరం.. కానీ దానితో ధోనికేం సంబంధం..

Posted: 04/29/2016 04:59 PM IST
What happened to dhoni is very unfortunate anil kapoor

టీమిండియా కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ దోని ఇటీవల అమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వైదోలగిన అంశంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ స్పందించారు. పలు ఆరోపణల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి ధోని గుడ్ బై చెప్పాల్సి రావడం నిజంగా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలంగా చట్టసమ్మతి ఉన్న కంపెనీపై ఒక వ్యక్తి ప్రభావం ఎంతమాత్రం ఉండదన్నాడు. అలా అని ఆ సంస్థ చేసే అన్ని పనులకు ఒక వ్యక్తిని బాధ్యుడ్ని చేయడం కూడా సరికదాని ఆయన అభిప్రాయపడ్డారు.

'రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది అన్ని సందర్బాల్లో ఒకే రకంగా ఉండదు. కొన్ని సందర్బాల్లో అదే వ్యాపారం చాలా నిజాయితీగా సాగినా.. మరికొన్ని సందర్భాల్లో అంచనాలకు తగ్గట్టుగా ఉండదు. ఒక వ్యక్తి  యావత్ సంస్థనే ప్రభావితం చేయలేడు. అటువంటప్పుడు ఆ సంస్థ నుంచి ధోని వైదొలగాలని డిమాండ్ రావడం దురదృష్టమే. ఒక సంస్థ ఇచ్చిన హామీలకు  క్రికెటర్ ను టార్గెట్ చేయడం ఎంతమాత్రం సరికాదు. గతంలో మ్యాగీ నూడుల్స్ వ్యవహారంలో కూడా అమితాబ్ బచ్చన్, మాధూరీ దీక్షిత్, ప్రీతి జింటాలపై కూడా ఇదే తరహాలో విమర్శలను చవిచూడాల్సి వచ్చింది'అని అనిల్ కపూర్ తెలిపాడు.

ఇటీవల రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలి బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ధోని వైదొలగాలంటూ ఇటీవల సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి. నోయిడాలోని ఓ హౌసింగ్‌ సొసైటీకి చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రాపాలికి బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉండటం మానుకోవాలని  ధోనికి సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేయడంతో పాటు, ఆ సంస్థ ధోనీని దుర్వినియోగం చేసింది. దోనితో ప్రచారం చేయించుకుని కస్టమర్లను నడివీధిలో వదిలేసిందని.. కనీస మౌలిక వసుతులు కల్పంచకుండా అక్యూపెన్సీని ఇచ్చిందంలూ బాధితుల సంఘం ఆన్‌లైన్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అమ్రాపాలి సంస్థ నుంచి ధోని ఆకస్మికంగా వైదొలిగాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendra singh dhoni  Amrapali  anil kapoor  brand ambassador  real estate  

Other Articles