ఐస్ క్రీం కోసం ఆగిన పెళ్లి | ice-cream leads to cancellation of marriage in UP

Ice cream leads to cancellation of marriage in up

UP, Marriage, Ice Cream, ఉత్తర్ ప్రదేశ్, పెళ్లి ఐస్ క్రీం

Shortage of ice-cream in a marriage party led to heated argument between the bride and groom sides and finally resulted in brick-batting in which three police personnel were injured and cancellation of the wedding.

ఐస్ క్రీం కోసం ఆగిన పెళ్లి

Posted: 04/29/2016 12:32 PM IST
Ice cream leads to cancellation of marriage in up

అసలే పెళ్లిళ్ల సీజన్ కాబట్టి పెళ్లిళ్ల హడావిడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ పెళ్లి గురించి మాత్రం చెప్పుకోవాలి.? అసలు ఆ పెళ్లి గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటారా..? ఆ పెళ్లి ఆగిపోయింది గనుక. పెళ్లి ఆగిపోతే మాకేంటి అనుకుంటున్నారా..? పెళ్లి ఆగిపోవడానికి కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు గనుక. సో తెలుసుకోండి మరి. ఎక్కడైనా పెళ్లిళ్లు ఆగిపోతాయి అంటే దానికి ప్రధాన కారణం కట్నం డబ్బులు. లేదంటే బంధువుల మధ్య గొడవలు అదీ లేదంటే పెళ్లి కొడుక్కు మరో పెళ్లి లాంటి కారణాలు విని ఉంటారు. కానీ ఐస్ క్రీమ్ వల్ల ఎక్కడైనా పెళ్లి ఆగుతుందా...?

బలం లేకుంటే అరటి పండు తిన్నా పళ్లు విరుగుతుంది అన్న చందాన.. ఐస్ క్రీమ్ కోసం ఓ పెళ్లి తంతు ఆగిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఓ ప్రాంతంలో వధువు ఇంటి వద్ద పెళ్లి వేడుకు అంగరంగవైభంగా జరగుతోంది. వరుడి తరుపు చుట్టాలు భోజనం ఆరగిస్తున్నారు. అయితే వరుడి తరపు నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐస్‌ క్రీం గురించి గొడవ మొదలెట్టారు. తమకు కావాల్సినంత ఐస్‌క్రీం లేదంటూ తగాదాకు దిగారు. అది చిలికి చిలికి గాలి వానగా మారింది. చిరకు రెండు పక్షాల వారు గొడవకు దిగారు. చివరకు పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వధువు తరఫు బంధువులు ఏకంగా రాళ్లదాడికి తెగబడ్డారు. దాంతో ఏకంగా పెళ్లి ఆగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles