తెలంగాణలో టెట్, ఎంసెట్ వాయిదా | TS Eamcet & TS TET Exam Postponed Rescheduled Date

Ts eamcet ts tet exam postponed rescheduled date

TET, EAMCET, TS, Telangana, TET Exam, EAMCET Exam, Postponed, తెలంగాణ, టెట్, ఎంసెట్

Here is the latest news for the aspirants those were serious in preparation for Telangana EAMCET Examination. Students were requested to notice the change in examination date. The Telangana EAMCET (Engineering Agricultural and Medical Common Entrance Test) date has been rescheduled from 2nd May to 3rd Week of May

తెలంగాణలో టెట్, ఎంసెట్ వాయిదా

Posted: 04/29/2016 10:49 AM IST
Ts eamcet ts tet exam postponed rescheduled date

ప్రభుత్వానికి, ప్రైవేట్ విద్యాసంస్థలకు మధ్య వార్ ముదిరింది. ఉన్నఫలంగా టెట్, ఎంసెట్ పరీక్షలకు సహకరించబోమని.. ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ ప్రకటించటంతో... తెలంగాణ ప్రభుత్వం టెట్, ఎంసెట్ ను వాయిదా వేసింది. ప్రైవేట్ సంస్థల బెదిరింపులకు లొంగేది లేదన్న సీఎం కేసీఆర్... మే 20లోపు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పరీక్షలు నిర్వహించి చూపిస్తామన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు చేసి తీరతామని ప్రభుత్వం..విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు ఎందుకంటూ.. ప్రైవేట్ యాజమాన్యాలు.. ఇలా ప్రభుత్వానికి, ప్రైవేట్ యాజమాన్యాలకు మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది.

ఇప్పుడు, టెట్, ఎంసెట్ కు సహకరించేది లేదని.. ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ ప్రకటించటంతో.. ఇష్యూ సీరియస్ అయ్యింది. మే1న జరగాల్సిన టెట్, మే2న జరగాల్సిన ఎంసెట్ ను మే 20లోగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిర్వహించి చూపిస్తామన్నారు సీఎం కేసీఆర్. ప్రైవేట్ విద్యాసంస్థల బెదిరింపులకు లొంగేది లేదని స్పష్టం చేశారు. టెట్, ఎంసెట్ నిర్వహణ పట్ల అభ్యర్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురికావొద్దన్నారు సీఎం కేసీఆర్. పరీక్షల నిర్వహణకు తగిన ఏర్పాట్లను చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని సీఎం ఆదేశించారు. బోగస్ విద్యా సంస్థలను ఏరివేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల సంఘాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాకపోతే మరెవరిదని సీఎం ప్రశ్నించారు. తనిఖీలు వద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో తనిఖీలు జరిగి తీరుతాయన్నారు. తనిఖీల్లో థర్డ్ పార్టీగా బిట్స్ పిలానీ,ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలుంటాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TET  EAMCET  TS  Telangana  TET Exam  EAMCET Exam  Postponed  తెలంగాణ  టెట్  ఎంసెట్  

Other Articles