clp leader jana reddy sensational comments in clp meeting

Jana reddy sensational comments on own party leaders

Telangana CLP leader, K. Jana Reddy, sensational comments, jana reddy hot comments, CLP meeting, Hyderabad, jana reddy out bursts anger on own party leaders, congress legislature party leader janareddy, TPCC, Uttamkumar Reddy,

congress legislature party leader janareddy out bursts on own party leaders with sensational comments in clp meeting

సోంతపార్టీ నేతలపై జానారెడ్డి తీవ్రవ్యాఖ్యలు.. పోమ్మనకుండా పోగబెడుతున్నారు..

Posted: 04/28/2016 06:55 PM IST
Jana reddy sensational comments on own party leaders

టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే అధికార పార్టీలో చేరతారని సొంత పార్టీ శ్రేణులే కామెంట్లు చేస్తుండటంపై సీఎల్పీ నేత జనారెడ్డి ఘాటుగా స్పందించారు. తనను పార్టీ నుంచి సాగనంపే కార్యక్రమాలకు సోంత పార్టీ నేతలే పూనుకుంటున్నారని అరోపించారు. తనను పార్టీలో మనజాలకుండా వెళ్లేందుకు పార్టీకి చెందిన ప్రముఖ నేతలు పొమ్మనకుండా పోగబెడుతున్నారని అగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను టీఆర్ఎస్ లోకి వెళుతున్నాననే వార్తలు పీసీసీ ఆఫీస్ బేరర్లే రాయించారని మండిపడ్డారు.

తాను ఎలాంటి పదవులను అశించలేదని, తాను చేపట్టడానికి ఏ పదవి కూడా కొత్తగా లేదని గతంలోనే వ్యాఖ్యానించిన ఆయన తన సీఎల్పీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనపై నమ్మకం లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కూడా తాను తప్పుకునేందుకు సిద్దమని వెల్లడించారు, అయితే ఎవరు చేసినా.. వ్యక్తులపై బురదజల్లడం సమంజసం కాదని అన్నారు. హైదరాబాద్ లో జరిగిన సీఎల్పీ భేటీలో జానారెడ్డి ప్రసంగం.. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను కలవరపాటుకు గురిచేసింది.

'పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎవరైనా ఆరోపణలు చేస్తే సీఎల్పీ నేతగా నేను వెంటనే ఖండిస్తా. అలాంటిది చాలా రోజులుగా నాపై సాగుతోన్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ ఖండించలేదు. నేను టీఆర్ఎస్ లో చేరుతానంటూ వచ్చిన వార్తలను ఉత్తమ్ కుమార్ ఖండించి ఉండాల్సింది. నిజానికి పీసీసీ ఆఫీస్ బేరర్లే ఆ వార్తలు రాయించారు. నా నాయకత్వంపై నమ్మకం లేకుంటే చెప్పండి.. సీఎల్పీ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటా' అని జానారెడ్డి ఎమ్మెల్యేలతో అన్నారు.

ఒక్కసారిగా సీఎల్పీ నేత అలా మాట్లాడటంతో విస్తుపోయిన ఎమ్మెల్యేలు.. క్షణాలపాటు బిత్తరపోయి, వెంటనే తేరుకున్నారు. 'మీరే మా నాయకుడిగా ఉండాలి' అని మూకుమ్మడిగా జనారెడ్డిని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత సాగునీటి ప్రాజెక్టులపై ఇవ్వాలనుకున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆలస్యం అవుతుండటంపై సీఎల్పీ చర్చించింది. వీలైనంత తొందరగా ప్రెజెంటేషన్ కు ఏర్పాట్లు పూర్తిచేయాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సమావేశానికి హాజరైనవారిలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, గీతా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డీకే అరుణ, వంశీచంద్ రెడ్డి, పద్మావతి, జీవన్ రెడ్డి, భాస్కర్ రావు, సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Reddy  sensational comments  CLP meeting  Hyderabad  

Other Articles