No, Donald Trump, beating Hillary Clinton will not be easy for you

Trump clinton score major victories

Priyanka Chopra, Donald Trump, Hillary Clinton, Republican Party, Power Lunch, Commentary, Elections, Hillary Clinton, Politics, US: News, Donald Trump, Republicans, Ted Cruz, Democrats, Paul Ryan, Power Lunch, Bernie Sanders, Cleveland

Donald Trump and Hillary Clinton scored huge victories that bring them closer to a monumental duel for the White House in the fall.

అధ్యక్ష రేసులో దూసుకెళ్లున్న హిల్లరీ, ట్రంప్..

Posted: 04/28/2016 12:37 PM IST
Trump clinton score major victories

డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించే దిశగా దూసుకు పోతున్నారు. మంగళవారం కీలక ప్రాంతాలైన మేరీల్యాండ్, కనెక్టికట్, డేలావేర్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్ వెరసి ఐదు రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఐదింటిలోనూ ట్రంప్ ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసి విజయకేతనం ఎగురవే శారు. హిల్లరీ కూడా ఐదు రాష్ట్రాలకు గాను రోడ్ ఐలాండ్ మినహా నాలుగింటిలో గెలిచారు. కాగా, ఈ ఎన్నికలతో దాదాపు 950 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి కావల్సిన మేజిక్ నంబర్ 1,237కు చేరువవుతున్నారు. మరోవైపు హిల్లరీ కూడా డెమోక్రాటిక్ నామినేషన్ సాధించే దిశగా 2,141 మంది డెలిగేట్ల మద్దతుతో మేజిక్ నంబర్ 2,383కు చేరువలో ఉన్నారు.

ట్రంప్‌పై ప్రియాంక మండిపాటు

డోనాల్డ్ ట్రంప్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని ట్రంప్ పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన టైమ్ 100 గాలాకు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక ఉగ్రవాదంపై మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించడం అనేది అనాగరిక చర్యగా ఆమె అభిప్రాయ పడ్డారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Donald Trump  Hillary Clinton  Republican Party  

Other Articles