water is life and water is everything

Water is life and water is everything

Water Day, World water Day, Water resources

Those of us who are concerned about the conservation of water and the planet’s other resources should view World Water Day today as the ideal time to start buying wholesome vegan foods instead of animal-derived ones. According to the US National Academy of Sciences, animal agriculture drains a third of the world’s fresh water.

నీరే జీవనాధారం.. నీరే జీవితం

Posted: 03/22/2016 11:44 AM IST
Water is life and water is everything

సుజలాం.. సుఫలాం.. మలయజశీతలాం.. సస్యశ్యామలం…  మనదేశం పరిస్థితిని వివరిస్తూ బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరగీతంలోని మాటలివి. కానీ.. ఇప్పుడు ఆ నదుల్లో పరవళ్లు తొక్కే నీరు లేదు.. సస్యశ్యామలమై దేశాన్ని శుభిక్షంగా ఉంచే పంటపొలాలు లేవు. వాటిపైనుంచి వీచే చల్లని పవనాలు లేవక. ఎక్కడ చూసినా నీటికోసం కోటి పాట్లు. గుక్కెడు నీటికోసం సిగపట్లు. ఒక్క మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇదే దుస్థితి. మరి దీనికి కారణమేంటీ..? ప్రపంచనీటి దినోత్సవం సందర్భంగా ప్రపంచ కన్నీటి కష్టాలపై స్పెషల్ స్టోరీ.

మనిషి బతకడానికి ముఖ్యంగా కావలసినవి గాలి, నీరు, ఆహారం. ఇప్పటికే చాలావరకు గాలి కలుషితమైపోయింది. చాలా దేశాల్లో ప్రజలు ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. ఇక ఇప్పుడు నీటి వంతు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు.. దేశాల మధ్య నీటి యుద్ధాలు మొదలయ్యాయి. పెరుగుట విరుగుట కొరకే.. అని మన పెద్దలు చెప్పిన సామెత ఊరికే పోలేదు. టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న ప్రెజెంట్ జెనరేషన్.. నిత్య జీవితానికి అవసరమైన వాటిని నిర్లక్ష్యం చేస్తోంది. జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. కానీ.. దానికి తగినట్టు నీటి వనరులు పెరగడం లేదు.. భూగర్భ జలాలు విపరీతంగా పడిపోతున్నాయి. అందుకే.. పర్యావరణం, ప్రగతి అంశంపై 1992లో ప్రత్యేక మహా సభ నిర్వహించింది ఐక్యరాజ్యసమితి. నీటి వనరులు రక్షించుకునేందుకు.. ప్రతి ఏటా మార్చి 22న వరల్డ్ వాటర్ డే నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుండి వరల్డ్ వాటర్ డే ను ఘనంగా నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Water Day  World water Day  Water resources  

Other Articles