chandrababu Naidu said Dont trouble farmers

Chandrababu naidu said dont trouble farmers

farmers, Ap, Chandrababu Naidu, Loans, Bankers

AP CM Chandrababu Naidu requested to Bankers to dont trouble famers. He also said bankers must show their Humanity.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Posted: 03/22/2016 10:42 AM IST
Chandrababu naidu said dont trouble farmers

రైతులను షరతులతో వేధించవద్దని ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు సూచించారు.తక్కువ రుణాలకు డిపాజిట్లు, ష్యూరిటీలతో రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేయవద్దని ఆయన అన్నారు. రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో షరతులతో అవస్థలకు గురిచేయవద్దని కోరారు. లక్ష నుంచి 3 లక్షల లోపు రుణాలకు డిపాజిట్లు అంటూ రైతులను ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. తక్కువ రుణాలకే డిపాజిట్లు, ష్యూరిటీలు అంటూ రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజల్ని అవస్థలకు గురిచేయడం సరికాదన్నారు. ఈ విషయంపై తాను ఎస్‌ఎల్‌బిసి ఛైర్మన్‌తో మాట్లాడానని, దీనికి ఆయన అంగీకరించారని తెలిపారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు, సీఎస్‌, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎస్‌ఎల్‌బిసి తీసుకున్న నిర్ణయాలను బ్యాంకర్లు అమలు చేయాలని చంద్రబాబు కోరారు. బ్యాంకింగ్‌ కన్సల్టెంట్లు లేని చోట స్వయం సహాయక సంఘాల మహిళల సేవలను ఉపయోగించుకోవాలని, ఈ సంఘాల సభ్యుల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తే ఆర్థికంగా వారికి వెసులుబాటు కలుగుతుందని వివరించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చుదిద్దుతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సేద్యపు కుంటల తవ్వకాలకు, రెయిన్‌గన్స్‌తో పంట తడి అందించేందుకు బ్యాంకులు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో సర్వీస్‌ సెక్టార్‌ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, బ్యాంకర్లు సహకారం అందిస్తే రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, దీని వల్ల రాష్ట్ర స్వరూపమే మారిపోతుందని చంద్రబాబు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmers  Ap  Chandrababu Naidu  Loans  Bankers  

Other Articles