rjd mla from nawada accused of kidnapping molesting minor girl

Rjd mla from nawada accused of kidnapping molesting minor girl

RJD MLA Rape, Nawada MLA, minor rape, minor girl abducted and raped, Rajballabh Yadav rape case, Bihar Mla kidnapping and molesting minor girl

Rajballabh Yadav, the RJD MLA from Nawada district in Bihar has been accused of kidnapping and molesting a minor girl. The state's DIG has ordered the arrest of the MLA and an investigation is currently underway

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఎమ్మెల్యే.. పరారీలో నిందితుడు..

Posted: 02/14/2016 12:38 PM IST
Rjd mla from nawada accused of kidnapping molesting minor girl

ప్రజలకు సేవకులుగా వుండాల్సిన ప్రజా ప్రతినిధులు బరితెగించే.. తమకు ఓట్లేసిన ప్రజలనే బలిపశువులను చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ తరహా ఘటనలు అటవిక పాలన కొనసాగుతుందన్న ఆరోపణలు ఎదుర్కోంటున్న బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో అధికంగా చోటుచేసుకుంటున్నాయి. అభం శుభం తెలియని అమాయక మైనర్ బాలికను తన కామావేశానికి బలి చేసి.. విషయాన్ని బయటకు చెప్పవద్దని ముప్పై వేల రూపాయలను ఇచ్చి తప్పించుకో జూసిన ఓ ప్రజా ప్రతినిధి భాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని అధికార ఆర్జేడీ ఎమ్మెల్యే రాజ్బల్లాబ్ యాదవ్ ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్టు కేసు నమోదైంది. రాజ్బల్లాబ్ యాదవ్ను అరెస్ట్ చేయాల్సిందిగా బిహార్ డీజేపీ ఆదేశించారు.

 ఈ నెల 6న తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఘటన వెలుగుచూసింది. ఎమ్మెల్యే ఇంట్లో బాధితురాలికి కాపలాగా ఉన్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఎమ్మెల్యే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎమ్మెల్యే కోసం గాలిస్తున్నారు. శనివారం రాత్రి నవడా జిల్లాలో పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేశారు. ఇదే జిల్లా నుంచి రాజ్బల్లాబ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.ఇటీవల బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే బీమా భారతి తన భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడానికి సాయపడినట్టు ఆరోపణలు ఎదుర్కోగా.. అదే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు సర్ఫరాజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RJD MLA Rape  Rajballabh Yadav rape case  Nawada MLA  minor rape Bihar  

Other Articles