It’s now Govt vs Oppn in JNU row; Congress, Left join protests, Centre firm

Rahul gadhi supports jnu students who were booked under anti nation case

jnu, jnu protests, jnu protest, jnu afzal guru, jnu afzal guru event, afzal guru event, afzal guru, jnu news, jnu protest news, delhi jnu, delhi news, india news, rahul gandhi, rahul gandhi jnu, rohit hcu student

Amid protests, Congress leaders Rahul Gandhi, Ajay Maken, Anand Sharma and CPM head Sitaram Yechury reached the campus.

భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారు.. హక్కుల కోసం మాట్లాడితే దేశద్రోహులా..

Posted: 02/14/2016 09:11 AM IST
Rahul gadhi supports jnu students who were booked under anti nation case

ఈ దేశంలో భిన్న వాదనలు వినిపించడం నేరమైపోయింది. హక్కుల గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహులుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అరోపించారు. యువ మేధావులను తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయాలు రాజకీయ కుట్రలకు నెలవవుతున్నాయని దుయ్యబట్టారు. కొద్ది రోజుల కిందట హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు హైదరాబాద్ వెళ్లాను. అతని స్నేహితులు, కుటుంబసభ్యులు నాకు చెప్పినదాన్నిబట్టి రోహిత్ ను కూడా దేశద్రోహిగా చిత్రీకరించారు. ఓ విద్యార్థి తన మనోభావాన్ని వ్యక్తపర్చినంత మాత్రాన దేశద్రోహి అవుతాడా? అని ప్రశ్నించారు. ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఉద్వేగపూరితంగా ప్రసంగిచారు

ఢిల్లీ యూనివర్సిటీకి చేరుకున్న రాహుల్ గాంధీ విద్యార్థులను దేశద్రోహం కేసుపై అరెస్టు చేయడాన్ని ఖండించారు. కాగా ఈ సందర్బంగా ఓ విద్యార్థి సంఘం ఆయన రాకను నిరసిస్తూ.. నల్లజెండాలను ప్రదర్శించింది. అయినా తాను మద్దతు ప్రకటించిన విద్యార్తి సంఘం తరపున ప్రసంగించారు. 'నేను ఇక్కడికి వస్తున్నప్పుడు కొందరు నా ముఖంపై నల్లజెండాలు ఎగురవేశారు. ఆ చర్య నాకు సంతోషం కల్గించింది. ఎందుకంటే నన్ను వ్యతిరేకించేవారు తమ నిరసనను తెలియజేశారు. అది వారి హక్కు. ఇలాంటి హక్కే అందరికీ ఉంటుంది. ఎవరికివారు విభిన్నవాదనలు, విభిన్న ఆలోచనలు కలిగిఉన్నంతమాత్రాన వారిని తప్పుపట్టలేం' అని రాహుల్ వ్యాఖ్యానించారు.
 
హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులను అణిచివేస్తున్నవారే నిజమైన దేశద్రోహులని, ఇలాంటి చర్యల ద్వారా వారు మనల్ని(ఆందోళనకారుల్ని) మరింత సంఘటితపరుస్తున్నారన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని అన్నారు. గొంతువిప్పి స్వేచ్ఛగా తమ భావాలు చెబుతోన్న వ్యక్తులంటే ప్రభుత్వం భయపడుతున్నదని రాహుల్ గాంధీ అన్నారు. జేఎన్ యూ విద్యార్థుల స్వరంతో 100 కోట్ల మంది ఏకీభవిస్తారని, అవతలివారు ఉద్దేశపూర్వకంగా నెలకొల్పిన ఉద్రిక్తతలకు ఆవేశపడొద్దని రాహుల్ గాంధీ విద్యార్థులకు హితవుపలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  jawaharlal university  delhi  anti national  

Other Articles