Stephenson case renews with notice to Jerusalem

No arrest in note for vote case acb tells jerusalem

cash for vote, note for vote, telangana government, telangana acb, MLA Stephenson, telangana MLC election, Jerusalem Muthiah

The Stephenson bribery case has come to the fore once again. While it was the alleged bribing of nominated MLA Stephenson to vote for TDP MLC candidate to the tune of Rs.50 lakh in the first instalment, the ACB case is to tighten the noose around Jerusalem Muthiah who was allegedly instrumental in the bribery in the second instalment.

ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక.. నో అరెస్టు అంటూ ముత్తయ్యకు ఏసీబీ నోటీసులు..

Posted: 02/13/2016 02:17 PM IST
No arrest in note for vote case acb tells jerusalem

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ‘ఓటుకు నోటు’ కేసులో మళ్లీ కదిలిక వచ్చింది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ కు చంద్రబాబు ఆహ్వానం, కేసీఆర్ హాజరు తదితర పరిణామాలతో ఈ కేసు దాదాపుగా మూలన పడిందనుకున్న కేసులో మళ్లీ ఇన్నాళ్లకు కదిలిక వచ్చింది. కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలని ఆయనకు నిన్న రాత్రి నోటీసులు అందాయి. వారంలోగా విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. ఉప్పల్ లోని మత్తయ్య ఇంటికెళ్లిన ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు.

తాజాగా ఈ కేసు ఫైలు కదిపిన టీ ఏసీబీ, ఆ నోటీసుల్లో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని ఏసీబీ మత్తయ్యకు హామీ ఇచ్చింది. అంతేకాక న్యాయవాదితో కలిసి విచారణకు రావచ్చని కూడా ఆయనకు తెలిపింది. కాగా, ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు జారీ చేసిన నోటీసుల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసు వెలుగు చూసిన వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మత్తయ్య ఏపీకి తరలివెళ్లారు. అక్కడి నుంచే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని తన అరెస్ట్ ను నిలువరించుకున్నారు. ఆ తర్వాత కానీ ఆయన హైదరాబాదులో అడుగుపెట్టలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles