AP Ministers cold war

Ap ministers cold war

Ap, Dokka manikyavaraprasad, Prattipati PullaRao, SC, manda Krishna Madiga

Cold war between AP Ministers Dokka manikyavaraprasad and Prattipati PullaRao. Dokka oppose the PullaRaos statements

పుల్లారావు Vs డొక్కా మాణిక్యవరప్రసాద్

Posted: 02/13/2016 01:57 PM IST
Ap ministers cold war

ఏపిలో సీన్ సీరియస్ అవుతోంది. అసలే కాపుల రిజర్వేషన్ల మీద చంద్రబాబు నాయుడుకి తీవ్ర తలనొప్పిగా మారింది. అయితే తాజాగా కాపుల రిజర్వేషన్ల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ మీద మంద కృష్ణ మాదిగ మరోసారి తెర మీదకు వచ్చారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను వర్గీకరించేందుకు హామీ ఇచ్చారని కానీ దాన్ని అమలు చెయ్యడం లేదని మండిపడ్డారు. అయితే ఇదే వివాదం మీద ఏపి మంత్రుల మధ్య నిప్పురాజుకుంది. పుల్లారావు చేసిన వ్యాఖ్యల మీద మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఫైరయ్యారు. ముందు అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సలహా ఇచ్చారు.

ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన లేదని మంత్రి పుల్లారావు అనడంపై డొ్క్కా స్పందించారు. ఓ వైపు సామాజిక న్యాయం కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడాలనుకుంటే పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడాలని, సమస్యపై అవగాహన లేకుండా పుల్లారావు సహా మంత్రులు ఎవరు మాట్లాడినా మంచిదికాదని హితవుపలికారు. ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీస్తాయని, సమస్య మరింత జఠిలమవుతుందన్నారు. పుల్లారావుకు కేటాయించిన శాఖ చాలా ప్రాధాన్యత కలిగినదని, ఆయన దానిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని సూచించారు. మాదిగలకు మందకృష్ణే నాయకుడని ఉద్ఘాటించిన డొక్కా.. మందకృష్ణకు పుల్లారావు సర్టిఫికెట్‌ అవసరంలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా చిన్నదని, ఆ పని తనకు అప్పగిస్తే 24గంటల్లో పరిష్కారం చూపుతానని అన్నారు. మందకృష్ణ సహా, మాదిగ నేతలతో రేపు సమావేశమవుతున్నానని, పుల్లారావు వ్యాఖ్యలు, ఎస్సీ వర్గీకరణపై చర్చిస్తామని డొక్కా చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Dokka manikyavaraprasad  Prattipati PullaRao  SC  manda Krishna Madiga  

Other Articles