license will be scrapped for drunk and drive

Traffic rules violiations leads to driving license suspension

license, drunk and drive, traffic rules, driving license, dl suspension, 3 months jail, rash driving, drunk and drive, signal jump, over load, cell phone driving

hyderabad traffic police amends traffic rules more strengthen soon, whom so ever violiates will face driving license suspension

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారో.. అసలుకే ఎసరు..

Posted: 02/12/2016 08:07 PM IST
Traffic rules violiations leads to driving license suspension

గ్రేటర్ హైదరాబాద్ వాహనచోదకులు ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి. నగరంలో ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా నిబంధనలు మరింత కఠిన తరం కాబోతున్నాయి. ద్విచక్ర వాహన దారులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనంపై వాహనచోదకులతో పాటు వెనుక కూర్చున్న వ్యక్తులూ హెల్మెట్ తప్పని సరిగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలను సవరించబోతున్నారు. ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై జరిమానా విధించడంతో సరిపుచ్చుతున్న పోలీసులు ఇకపై లెసైన్స్ రద్దు చేసే విధానాన్ని త్వరలోనే అమలులోకి తేనున్నారు.

అతి వేగంగా నడపడం, రాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ సిగ్నల్ జంప్, ఓవర్ లోడ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం... వీటిల్లో ఏది ఉల్లంఘించినా డ్రైవింగ్ లెసైన్స్ రద్దు చేయనున్నారు. ఇలా నిబంధనలను ఉల్లంఘించిన వారి వివరాలను రవాణా శాఖ కు సమర్పించి నిర్ణీత కాలం పాటు డ్రైవింగ్ లెసైన్స్ సస్పెండు చేయించే విధంగా చర్యలకు హైదరాబాద్ ట్రాపిక్ పోలీసులు ఉపక్రమిస్తున్నారు. డ్రైవింగ్ లెసైన్స్ సస్పెన్షన్ లో ఉన్నప్పుడు వాహనాలను నడిపినట్టు తేలితే నడిపిన వ్యక్తిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తారు. దానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష తప్పదు. సో ఫ్రెండ్స్ బీ కేర్ ఫుల్..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : license  drunk and drive  traffic rules  driving license  dl suspension  3 months jail  

Other Articles