court order to custody for Agrigold chairman and MD

Court order to custody for agrigold chairman and md

Agrigold, Agrigold MD, AP, telangana, Eluru, Eluru court

court order to custody for Agrigold chairman and MD. Crime Investigation Department sleuths on Thursday took into custody AgriGold Chairman and Managing Director Avva Venkata Rama Rao and MD, Agri Gold Farm Estates India Pvt. Ltd, Avva Venkata Seshu Narayana Rao.

అగ్రిగోల్డ్ చెర్మెన్, ఎండీకి 14 రోజుల రిమాండ్

Posted: 02/12/2016 12:56 PM IST
Court order to custody for agrigold chairman and md

అగ్రిగోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సీఎండీ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయలకు ఏలూరు రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. నిన్న రాత్రి అరెస్టు చేసిన వారిద్దరిని ఏలూరులోని పోలీస్ అతిధిగృహంలో విచారించారు. ఈ ఉదయం సీఐడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో కోర్టు దగ్గర భారీ భద్రత ఉంది. ముందుగా వారిద్దరినీ తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి తిరస్కరించారు. అనంతరం 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్టు ఆదేశించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం వారిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పలువురి నుంచి  భారీగా డిపాజిట్లు సేకరించి గడుపు ముగిసినా డబ్బులు చెల్లించకుండా వ్యవహరిస్తుండటంతో పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  

ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు తీసుకుని వాటిని తిరిగి చెల్లించడంలో విఫలమైన అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వాసు వెంకటరావును, ఎండీ అవ్వాసు వెంకట శేషనారాయణరావులను సీఐడీ అరెస్టు చేసింది. కాగా తమ దగ్గర తీసుకున్న అప్పు రూ. 105 కోట్లు చెల్లించకపోవడంతో ఆంధ్రాబ్యాంక్ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయాన్ని సీజ్ చేసింది. దానిని వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ లోని హైకోర్టులో ఈకేసుపై నేడు విచారణ జరుగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Agrigold  Agrigold MD  AP  telangana  Eluru  Eluru court  

Other Articles