Valentine loan application of Gujarat bank officer

Valentine loan application of gujarat bank officer

Valentine loan, Gujarat, Loan for Gift, Lovers

The application of a bank officer, who mentioned “Valentine” as a festival on a loan form, has gone viral on social media.Twenty-five-year old Digvijay Singh, a probationary officer in State Bank of India in Junagarh at Gujarat, recently applied for an advance festival loan for Rs 42,970, mentioning “Valentine” as the festival. But the bank rejected his request, saying it was an “invalid festival”.

లవర్ కు గిఫ్ట్ కొనివ్వడానికి లోన్ కావాలట

Posted: 02/12/2016 11:25 AM IST
Valentine loan application of gujarat bank officer

బ్యాంకుల్లో లోన్ కావాలంటే ఎంత కష్టపడాలి.. సవాలక్ష ఎంక్వైరీలు, అన్ని పర్ ఫెక్ట్ గా ఫైల్ చెయ్యాలి అయినా కూడా బ్యాంకు వాళ్లు లోన్ ఇస్తారో లేదో తెలియదు.. కానీ ఓ కుర్రాడు మాత్రం ఎందుకు లోన్ కావాలో చెబితే అక్కడున్న బ్యాంకు ఆఫీసర్ల ఫ్యూజులు ఎగిరిపోయాయట. అవును.. అయినా ఇలాంటి కారణానికి కూడా లోన్ ఇస్తారా బాబూ అంటూ తెగ షైరయ్యారట. అయినా అయ్యగారు దేనికి లోన్ అడిగాడో తెలిస్తే మీరు కూడా అలానే ఫీలవుతారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలని.. అందుకు బ్యాంక్ లోన్ కావాలని అడిగాడట. కానీ మొత్తానికి మనోడికి లోన్ వచ్చింది.. కాకపోతే వేరే కారణం చూపించిన తర్వాత. అసలు మ్యాటర్ ఏంటో మీరే చదవండి.

వాలెంటైన్ డ్సే రోజు.. ప్రేమికులకు పండుగే. లవర్‌కి మంచి గిఫ్ట్ ఇచ్చేందుకు ఎంత ఖర్చైనా పెట్టాలనుకుంటారు. గుజరాత్‌కి చెందిన ఓ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం.. ఓ కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అతడి పేరు దిగ్విజయ్ సింగ్. గుజరాత్‌లోని స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ప్రొబేషనరీ అధికారిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతని దగ్గర బహుమతి కొనివ్వడానికి అంత డబ్బులేవు. అందుకే తను చేసే బ్యాంకులోనే 42, 970 రూపాయలు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. కారణం.. వాలెంటైన్స్ డే సందర్భంగా అని రాశాడు. బ్యాంక్ అధికారులు తిరస్కరించారు. మరోసారి ప్రయత్నించాడు. అయితే ఈసారి మాత్రం తన దరఖాస్తులో ప్రేమికుల దినోత్సవానికి బదులు వసంత పంచమి సంబురాలకు లోన్ ఇవ్వాల్సిందేనని కోరాడు. వెంటనే బ్యాంక్ రుణం ఇచ్చేసిందట. ఆ డబ్బుతో ప్రేయసికి గిఫ్ట్ కొనిస్తానంటున్నాడతను. ప్రేమికులంతా ఇలానే బ్యాంక్‌లోన్ తీసుకుంటున్నారో అనిపిస్తోంది కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Valentine loan  Gujarat  Loan for Gift  Lovers  

Other Articles