Mexico prison riot: at least 52 people killed and 12 injured in Monterrey

Mexico prison riot at least 52 people killed and 12 injured in monterrey

Mexico, Prison, prison, northern Mexico

A riot at a prison in the Mexican city of Monterrey involving inmates belonging to rival drug cartels has left at least 52 dead and 12 injured, just days before Pope Francis is due to visit another prison in northern Mexico.

జైల్ లో గ్యాంగ్ వార్.. 52 మంది మృతి

Posted: 02/12/2016 10:57 AM IST
Mexico prison riot at least 52 people killed and 12 injured in monterrey

జైల్ లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలు గ్యాంగ్ వార్ కు దిగారు. ఒక గ్యాంగ్ మరో గ్యాంగ్ మీద దాడికి దిగింది... అలా జరిగిన గ్యాంగ్ వార్ లో దాదాపు 52 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఉత్తరమెక్సికోలోని మాంటరే నగరంలో టోపోచికో జైలులో రెండు ప్రత్యర్థివర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 52 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. జైలు లోపలి భాగం పేలుళ్లతో దద్దరిల్లింది. నుయెవో లియాన్ రాష్ట్ర గవర్నర్ జేమీ రోడ్రిగ్జ్ దీని మీద వివరణ ఇచ్చారు. డ్రగ్స్ సప్లై చేసే గ్యాంగులకు గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్నాయని.. తాజాగా వీరి మధ్యన భారీగా గొడవలు జరిగినట్లు తెలిపారు.

కరుడుగట్టిన జెటాస్ డ్రగ్ ముఠాకు ఈ ఘర్షణలతో సంబంధముందని అంటున్నారు. జైలులో వ్యాపించిన మంటల వల్ల కొందరు గాయపడ్డారు. జైలు నుంచి పొగలు రావడం ఓ టెలివిజన్ చానెల్ చూపింది. ఈ గందరగోళం మధ్య పలువురు ఖైదీలు పారిపోయారు. దీనికి జుయాన్ పిడ్రో సాల్విడర్ నేతృత్వం మహించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా రెండు గ్యాంగ్ ల మధ్య ఇలాంటి వార్ నడిచినా కానీ ఏకంగా 52 మంది ప్రాణాలు పోవడం మాత్రం కలకలం రేపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexico  Prison  52 dead  

Other Articles