mla chintamaneni prabhakar lands in another controversy

Police conistable alleges attack by mla chintamaneni prabhakar

Chintamaneni Prabhakar, TDP MLA, Chintamaneni Prabhakar Controversy, West godavari, denduluru mla chintamaneni another controversy, chintamaneni attacks police conistable, police conistable madhu,

West godavari denduluru mla chintamaneni prabhakar lands in another controversy as police conistable madhu alleges attack by prabhakar

ఈ చింత పయనమంతా వివాదాలేనా..! ప్రబాకర్ పై కానిస్టేబుల్ పిర్యాదు

Posted: 02/10/2016 06:34 PM IST
Police conistable alleges attack by mla chintamaneni prabhakar

చింత చచ్చినా పులుపు చావదన్నది పాత సామెతజ  అయితే పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను చూసిన వారు మాత్రం ఆ సామెతను కాస్తంత తిరగేసి.. ఈ చింత ఒంటి నిండా వివాదాలే అని వ్యంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే. ఎమ్మెల్యే చింతమనేని ప్రబాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మార్వో వనజాక్షి మొదలుకుని, అటవీశాఖ అదికారుల తరువాత ఎమ్మెల్యే చింతమనేని తాజాగా పోలిసు కానిస్టేబుల్ పైనే దాడి చేశాడు. ఈ మేరకు బాధిత కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాదికారులకు పిర్యాదు చేయడంతో విషయం బయటకు పోక్కింది.

తనపై దాడి చేశారని ఏలూరుకు చెందిన పోలీసు కానిస్టేబుల్ మధు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల ఓ సివిల్ తగాదాలో చింతమనేని జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో కానిస్టేబుల్ మధుపై దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో డి.వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కోల్లేరు ప్రాంతంలో అటవీశాఖ నిబంధనలకు విరుద్ధంగా రహదారిని నిర్మించారు. అదికూడా ఆటవీశాఖ అధికారుల సమక్షంలోనే చోటు చేసుకోవడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chintamaneni Prabhakar  TDP MLA  Chintamaneni Prabhakar Controversy  West godavari  

Other Articles