Warnings | Lovers | Valentine day | 14 Feb | Couples

Warning for indian lovers on valentines day

Warning for indian Lovers on Valentines day, indian Lovers on Valentines day, Valentines day specials, Valentines day gifts, Valentines day cards, Valentines day articles, Valentines day programs, Valentines day party, Valentines day

Warning for indian Lovers on Valentines day: Akhila Bharata Hindu Mahasabha peoples warns to lovers on Valentine.

ఆరోజు జంటగా కనిపిస్తే పెళ్లి.. పురోహితులు సిద్ధం

Posted: 02/10/2016 03:36 PM IST
Warning for indian lovers on valentines day

ప్రేమికుల రోజున ప్రేమికులందరూ కూడా వారు ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను వ్యక్తపరచాలని, వాళ్లను కలవాలని, ఆరోజంతా వారితో సరదగా గడపాలని అనుకుంటారు. కానీ వీరి ప్రేమకు అఖిల భారత హిందూ మహాసభ వారు అడ్డుపడుతున్నారు. విదేశాల్లో వాలెంటైన్స్ డే ను చాలా గ్రాండ్ గా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

గతంలో ఇండియాలో కూడా ‘వాలెంటైన్స్ డే’ను గ్రాండ్ గా జరుపుకునేవారు. కానీ ఈ మధ్య పలు సంఘాలు వీటికి అడ్డుపడుతున్నాయి. ‘వాలెంటైన్స్ డే’ మన భారత సంప్రదాయాలకు వ్యతిరేకమని వాదిస్తూ.. ‘వాలెంటైన్స్ డే’ల ఏడు రోజుల వరకు ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ప్రతి సంవత్సరంలానే ఈ ఏడాది కూడా ‘అఖిల భారత హిందూ మహాసభ’ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14‘వాలెంటైన్స్ డే’ వరకు ప్రేమికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ రోజున బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో కనిపించే ప్రేయసీ ప్రియులకు అప్పటికప్పుడు వివాహం చేసేస్తామని మహాసభ జాతీయ కార్యదర్శి మున్నా కుమార్ శర్మ తెలిపారు.

ఈనెల 14న మొత్తం 10 వేల మంది వాలంటీర్లు ప్రేమికులను నిలువరించేందుకు వీధుల్లో పహారా కాస్తారని తెలిపారు. వారికి వివాహాలు చేసేందుకు పురోహితులను సైతం సిద్ధం చేశామని వివరించారు. గత సంవత్సరం ప్రేమికుల రోజున 100 వివాహాలు చేశామని, వివాహానికి సిద్ధమైతేనే ప్రేమికులు 14న బయటకు రావాలని అన్నారు. మరోవైపు భజరంగదళ్ సైతం ఇదే విధమైన హెచరికలు జారీ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Valentines day  Lovers  14 Feb  Marriages  Couples  Gifts  

Other Articles