Shocking moment a CHEETAH jumped on to safari bus and refused to move for almost an hour

Cheetah chills out on safari tourists vehicle

Heart-stopping footage shows how holidaymakers were held up for almost an hour when a cheetah decided to perch on their safari truck in Africa.

Heart-stopping footage shows how holidaymakers were held up for almost an hour when a cheetah decided to perch on their safari truck in Africa.

పర్యాటకుల కారుపై గంట పాటు చిరుత హల్ చల్

Posted: 02/10/2016 10:06 AM IST
Cheetah chills out on safari tourists vehicle

రెండు రోజుల క్రితం భారత్ లోని బెంగళూరులో జనారణ్యంలోకి వచ్చిన చిరుత పెద్ద ఎత్తున అలజడి సృష్టించి.. ఆరుగురిని గాయపర్చి.. పలాయనం చిత్తగిత్తగా, అటు ఆఫ్రికాలోని కెన్యాలో కూడా చిరుత పర్యాటకులకు చుక్కలు చూపించింది. కెన్యాలోని మారా జాతీయ రిజర్వు పార్కులో ఓ చిరుత పరుగుపరుగున ఎదురువచ్చి.. పర్యాటకుల సఫారీ జీపుపై ఉరికి ఎంతో ఆనందంగా వారిని చూస్తూ కూర్చుంది. దీంతో ఒక్కసారిగా బిత్తరపోయిన పర్యాటకులు పట్టపగలు చుక్కలు చూశారు. సుమారు గంటపాటు వారి ఓపికను పరీక్షించిన చిరుత చివరకు తనంతట తానుగా జీపు దిగి.. దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

వివరాల్లోకి వెళ్లే.. కెన్యాలోని మారా నేషనల్ రిజర్వ్ లో ప్రయాణికుల సఫారీ కారును అడ్డుకున్న చిరుత దాదాపు గంటపాటు వారిని కదలనీయలేదు. అయితే జీపులో ఉన్నవారికి మాత్రం ఎలాంటి హాని తలపెట్టలేదు. చిరుత ఉన్నంతసేపు వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చూశారు. ఆ తరువాత కోలుకుని పర్యాటకులు తీసిన మూడు నిమిషాల వీడియో క్లిప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. మసాయ్ మారా రిజర్వ్ పార్కునుంచి ఓపెన్ టాప్ సఫారీ కారు ప్రయాణిస్తుండగా ఉన్నట్లుండి కారుపైకి చిరుత ఎక్కడం ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తోంది. ముందుగా పక్కనే ఉన్న గడ్డిలోంచి ప్రత్యక్షమైన ఆ అడవి మృగం...  కుడిపక్కనుంచి జీపుఎక్కి పర్యాటకుల కెమేరావైపు తేరిపార చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత అక్కడే  ప్రశాతంగా కూర్చుండిపోయింది. దీంతో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కారులోని పర్యాటకులు తమ భయాన్ని పంచుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చిరుత వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుని.. అమ్మో గుండె ఎంత స్పీడుగా కొట్టుకుందో అంటూ తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.

45 నిమిషాలపాటు ఊరుకున్న టూరిస్టు గైడ్ ఇక లాభం లేదని.. చిరుత కదిలేలా లేదని తమ వాహనం ఇంజిన్ ను మెల్లగా స్టార్ట్‌ చేశాడు. దీంతో అప్పటిదాకా తీరిగ్గా కూచున్న చిరుత పులి పెద్దగా కాళ్ళు చాచి ప్రయాణీకులవైపు చూసింది. ఒళ్ళు విరుచుకొని కారు ముందుకు దిగి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో పర్యాటకులు అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎట్టకేలకు ప్రాణాలు నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తుండగా వీడియో ముగుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shocking  moment  cheetah  kenya  mara national reserve  africa safari  

Other Articles