qutbullahpur mla vivek joins trs

Telangana tdp mla vivek join trs

chandrababu naidu, quthbullapur mla, kp vivekananda, telugudesam, telangana, trs, kcr, telangana tdp, telangana tdp mla, madhavaram krishna rao, cm camp office

telangana tdp mla and qutubullahpur legislative member vivek joined trs in the leader ship of chief minister kcr

తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ.. కారెక్కిన మరో ఎమ్మెల్యే..

Posted: 02/09/2016 01:12 PM IST
Telangana tdp mla vivek join trs

తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కెపి వివేకానంద (వివేక్) అటు టీడీపీ పార్టీకీ, ఇటు జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాకిచ్చారు. సైకిల్ ప్రయాణానికి స్వస్తి పలికి.. ఇక అధికారిక పార్టీలో చేరి కారు ప్రయాణం చేస్తున్నాడు. దీంతో ఆయన టిడిపికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అటు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అదినేత కల్వకుంట చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన వివేక్ ను.. సీఎం కేసీఆర్ గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వివేక్‌ను టిఆర్ఎస్‌లోకి తీసుకు రావడంలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మధ్యవర్తిగా వ్యవహరించారు. వివేక్ ను క్యాంప్ కార్యాలయానికి మాధవరం తీసుకు వచ్చారు. ఇదిలావుండగా టీఆర్ఎస్ పార్టీలో చేరడం తనకు స్వగృహంలో చేరిన సంతోషాన్ని కలిగిస్తుందని వివేక్ అన్నారు. గతంలో టీఆర్ఎస్ హైదరాబాద్ యువత విబాగానికి తాను అద్యక్షుడిగా కూడా వ్యవహరించానని చెప్పారు. గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీని సంపూర్ణంగా వుండాలని కోరుకుంటూనే తీర్పునిచ్చారని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు చెప్పారు. నియోజక ప్రజలు అబివృద్దిని కోరుకుంటున్నారని, అబివృద్ది కోసమే తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. అటు తెలంగాణ టీడీపీలో చంద్రబాబు లేని లోటు కూడా గ్రేటర్ ఎన్నికలలో కనిపించిందని వివేక్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles