Quthbullapur MLA | Vivek | Quits | TDP | TRS

Quthbullapur mla vivek quits tdp

Quthbullapur MLA Vivek Quits TDP, Quthbullapur MLA Vivek resigns to TDP, Quthbullapur MLA Vivek exit from TDP, Quthbullapur MLA Vivek, Quthbullapur MLA Vivek trs, Quthbullapur MLA Vivek resigns, Quthbullapur MLA Vivek stills

Quthbullapur MLA Vivek Quits TDP: Telangana Quthbullapur TDP MLA Vivek Quits from TDP party. Vivek ready to join in TRS party.

ITEMVIDEOS: తెలంగాణ టీడిపికి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్

Posted: 02/09/2016 11:05 AM IST
Quthbullapur mla vivek quits tdp

తెలంగాణలో ఇటీవలే జరిగిన GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి, 99 సీట్లతో రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. టిడిపి పార్టీకి ఒకే ఒక్క టికెట్ దక్కడంతో టిడీపి పార్టీ సభ్యుల్లో కాస్త జోష్ తగ్గింది. దీంతో తెలంగాణలోని టీడిపి పార్టీ సభ్యుల వలస ప్రారంభమయ్యింది. తాజాగా కుత్బుల్లాపూర్ టిడిపి MLA వివేక్ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.

ఇందుకు టిడిపి పార్టీ ఆఫీస్ కి తన రాజీనామా లెటర్ ను ఫ్యాక్స్ ద్వారా పంపించారు వివేక్. వివేక్ తో పాటుగా మరో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యినట్లుగా తెలిసింది. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నేరవేరుస్తూ... ప్రజల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ కొనసాగుతుండటంతో ఇతర పార్టీల్లో వున్న నాయకులు సైతం టీఆర్ఎస్ పార్టీల్లో చేరడానికి ఆలోచిస్తున్నారు.


Video Source: NTV Telugu

గ్రేటర్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ లో మరింత ఊపొచ్చిందని చెప్పుకోవచ్చు. వివేక్ ను క్యాంప్ ఆఫీసుకు తీసుకొచ్చిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాసేపట్లో సిఎం కేసిఆర్ ను కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న వివేక్. గ్రేటర్ ఎన్నికల ముందే వివేక్ టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అనుకున్నారని, కాకపోతే పలు కారణాల వల్ల ఆలస్యం జరిగి, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో కేసిఆర్ సమక్షంలో వివేక్ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Quthbullapur MLA  Vivek  Quits  Resignation  TDP  TRS  

Other Articles