Mudragada Padmanabham | Ends Indefinite Fast | Kala Venkat rao

Mudragada padmanabham talks about his indefinite fast

Mudragada Padmanabham talks about his Indefinite Fast: Kapu sangham leader Mudragada Padmanabham Ends Indefinite Fast. AP govt accept his demands.

Mudragada Padmanabham talks about his Indefinite Fast: Kapu sangham leader Mudragada Padmanabham Ends Indefinite Fast. AP govt accept his demands.

ITEMVIDEOS:కోటీశ్వరులకు రిజర్వేషన్లు ఇవ్వనవసరం లేదు

Posted: 02/08/2016 03:26 PM IST
Mudragada padmanabham talks about his indefinite fast

గత నాలుగు రోజులుగా తన కుటుంబ సభ్యులతో పాటు కాపుల రిజర్వేషన్ల విషయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మానాభం నేడు తన దీక్షను విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్షను విరమించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాపుల సంక్షేమం కోసం స్పష్టమైన హామీ వచ్చినందునే నేను ఆమరణ దీక్షను విరమించానని ముద్రగడ పద్మనాభం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీలు అమలు అయ్యేలా చూసే బాధ్యతను కూడా ఇకమీదట చేపడతానని తెలిపారు. కాపులలో కూడా పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని, ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు రిజర్వేషన్లు అక్కర్లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పంపిన బృందం చేసిన ప్రతిపాదనలలో చిన్న చిన్న సడలింపులున్నా, జాతి హితం కోసం తాను అంగీకరించినట్లుగా ముద్రగడ వెల్లడించారు.

తన జాతి ఆకలి కేకలు తట్టుకోలేక రోడ్డెక్కాను తప్ప తనకు ఎవరినీ అవమానించే ఆలోచన లేదని, తాను ఎప్పుడూ సీఎంను కావాలని తిట్టాలని, అవమానించాలని గానీ అనుకోలేదని ముద్రగడ చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం కావడంతో పలు రకాల అనుమానాలు వచ్చి.. అనరాని మాటలు అని ఉంటానని, వాటికి క్షమించాలని కోరారు. మంజునాథ కమిషన్ నివేదిక తెప్పించుకుని, కేబినెట్‌లో పెట్టి, కేంద్రానికి పంపి అక్కడ కూడా ఆమోదింపజేస్తే మీ ఇంటికొచ్చి పళ్లెంలో కాళ్లు కడుగుతామని ఆయన అన్నారు.

అత్యంత పేదవారికి మాత్రమే రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం తప్ప.. ఇందులో లక్షాధికారులు, కోటీశ్వరులకు అక్కర్లేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇచ్చే సమయంలోనే ఈ క్లాజు కూడా పెట్టాలని చెప్పారు. బీసీ కోటాలో తగ్గించడం వద్దని, వాళ్లు ఎస్సీ ఎస్టీలు అనుభవించే కోటా కాకుండా తమకు కొంత హక్కు ఇవ్వాలని కోరాము తప్ప.. వాళ్ల నోటి దగ్గర కూడు తినే ఆలోచన తమకు లేదని ఆయన అన్నారు. ఇక తుని ఘటనలో చాలామంది మీద అక్రమంగా కేసులు బనాయించారని, కేసుల జాబితాను తనకు కూడా ఇవ్వాలని.. పూర్తి విచారణ తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని ముద్రగడ పద్మనాభం చెప్పుకొచ్చారు.


Video Source: NTV Telugu

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada  Indefinite Fast ends  Acchennayudu  Kala Venkat rao  

Other Articles