Acchennayudu | Mudragada | Padmanabham | Ends Indefinite Fast | Kala Venkat rao

Acchennayudu talks about mudragada padmanabham indefinite fast

Acchennayudu talks about Mudragada Indefinite Fast, Acchennayudu talks about Mudragada, Mudragada Padmanabham Ends Indefinite Fast, Mudragada Padmanabham Indefinite fast ends, Mudragada Indefinite fast, Mudragada meets AP govt leaders, Mudragada latest news, Mudragada

Acchennayudu talks about Mudragada Padmanabham Indefinite Fast: Kapu sangham leader Mudragada Padmanabham Ends Indefinite Fast. AP govt accept his demands.

ITEMVIDEOS:దాడి చేసినోళ్లకు మాత్రమే కఠిన శిక్షలు: అచ్చెన్నాయుడు

Posted: 02/08/2016 03:23 PM IST
Acchennayudu talks about mudragada padmanabham indefinite fast

కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు సఫలీకృతం అయ్యింది. తన డిమాండ్లకు ప్రభుత్వం దిగొచ్చింది. గంటన్నరకు పైగా ముద్రగడతో ప్రభుత్వ ప్రతినిధులుగా టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావులు చర్చలు జరిపారు.  ప్రభుత్వం తన డిమాండ్లను ఒప్పకోవడంతో ముద్రగడ నిమ్మరసం తాగి దీక్షను విరమించారు.


Video Source: NTV Telugu

అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ పక్షాన ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపామని, చర్చలు సఫలీకృతం అయ్యాయని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పద్మనాభం దీక్ష విషయంలో చాలా సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఏ ఒక్క వర్గానికీ ఇబ్బంది లేకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీలైనంత త్వరగానే జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదికను పూర్తి చేయాలని అనుకుంటున్నారు అని అన్నారు. తుని ఘటనలో బయటి నుంచి కొంతమంది వచ్చారని, మరికొందరు తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ ఘటనపై చాలా కేసులు బుక్ చేశామని, వాటిపై లోతైన దర్యాప్తు జరిపి.. వారిపైనే కఠిన నిర్ణయాలు ఉంటాయని, దాంతో సంబంధం లేనివారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలూ సంయమనంతో ఉండాలని, రెచ్చగొట్టే ప్రకటనలు చూసి రెచ్చిపోకూడదని ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Acchennayudu  Mudragada  Indefinite Fast ends  Acchennayudu  Kala Venkat rao  

Other Articles